Navratri Day 5: సరస్వతీ నమోస్తుతే.. చదువుల తల్లి అలంకరణలో అమ్మవారు
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
Navratri 2020 day 5: Worship Devi Skandamata for wisdom: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు (Navratri 2020) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది. దేవీ నవరాత్రుల్లో ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు మూలనక్షత్రంలో దుర్గా దేవీ చదువుల తల్లి సరస్వతి దేవి ( Devi Skandamata ) గా విరాజల్లుతుంది. సరస్వతీ దేవి ( saraswati devi ) తెల్లని చీరను ధరించి.. దేవతల సైన్యాధిపతియైన స్కందుడు లేదా సుబ్రహ్మణ్యాన్ని పిల్లవాడిగా తన ఒడిలో ఉంచుకుని సింహంపై స్వారీ చేస్తూ ఉంటుంది. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి నాలుగు చేతులల్లో వీణా, దండం, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో ఈదేవి భక్తులకు దర్శనమిస్తుంది. Also read: Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు
సరస్వతీ దేవి (స్కందమాత) ని పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహా పండితుడు అవుతాడని భక్తులకు అపార నమ్మకం. విద్యా, జ్ఞానం, మోక్షం, శ్రేయస్సు, మనశ్శాంతి పొందేందకు భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు. మాత స్కందమాతను ఆరాధించడం ద్వారా భక్తులకు కార్తికేయును ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ అమ్మవారి ప్రసన్నం వల్ల విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలిగి ఉన్నతంగా ఎదుగుతారు. అందుకే ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసాలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు సమర్పించి కలువ పూలతో భక్తులు పూజలు చేస్తారు. ఈ సందర్భంగా శ్లోకాన్ని పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
పఠించవలసిన సరస్వతీ అమ్మవారి శ్లోకం..
“ఘంటాశూల హలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జెర్దధతీం
ఘనాంత విలసచ్ఛీతాంశు తుల్య ప్రభామ్ గౌరీదేహ సముద్ఛవాం
త్రిజగతామాధారాభూతాం మాహా పూర్వా మత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీమ్”
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న విజయవాడ కనక దుర్గా ఆలయానికి, బాసర శ్రీ సరస్వతీ ఆలయానికి భక్తులు బుధవారం పోటెత్తారు. క్యూలైన్లల్లో గంటలకొద్ది నిల్చుని సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. దీంతోపాటు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు సైతం చేయిస్తున్నారు.
Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe