Prasanth Varma Announced New Project Amid Mokshagna Movie: హనుమాన్తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ అదే ఊపుతో వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చిత్రాన్ని పట్టాలకెక్కించిన ఈ యువ దర్శకుడు మూడో సినిమాను ప్రకటించాడు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
Navaratri 2024 celebration: నవరాత్రుల్లో దుర్గామాత పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరిస్తారు. మన దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంబరాన్నుంటుతాయి. అయితే, నవరాత్రులు కేవలం మన దేశంలోనే కాదు మరో 5 దేశాల్లో కూడా జరుపుకొంటారు. అవేంటో తెలుసుకుందాం.
Meat Banned During Navaratri: నవ రాత్రుల సందర్భంగా చికెన్, మటన్ విక్రయాలు బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు అక్టోబర్ 3 నుంచి నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 11 తో ముగుస్తాయి. ఈ సందర్భంగా మాంసం విక్రయించకూడదని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
Ram Navami 2023: రామజన్మోత్సవ వేడుకలు అయోధ్యలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతునట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
IRCTC Tour Packages: చైత నవరాత్రుల సందర్భంగా ఐఆర్సీటీసీ తీపి కబురు అందించింది. కేవలం 10 వేల రూపాయలతో 5 దేవాలయాలను సందర్శించవచ్చని ప్రకటించింది. యాత్రికుల కోసం రెండు తేదీల్లో టూర్ ప్యాకెజీని అందుబాటులోకి తీసుకుచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం ఇకపై ప్రతీ రోజు 15 వేల మంది భక్తులకు మాతా వైష్ణోదేవిని ( Mata Vaishno Devi ) దర్శించుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
ఆశ్వీయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులపాటు దేవిశరన్నవరాత్రుల్లో (navaratri 2020) భాగంగా కనకదుర్గా దేవిని రోజుకొక అవతారంలో భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆశ్వీయుజ దశమినాడు ‘దసరా’ (Dussehra 2020) లేదా విజయదశమిగా జరుపుకుంటారు. అయితే దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది శమీపూజ (జమ్మిచెట్టు) (Jammy Chettu), పాలపిట్ట (Palapitta) దర్శనం.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు.
Sattvic Drinks | దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్.
దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. ఈ రోజుల్లో ఎంతో నిష్టతో ఉపావాసాలుంటూ.. దుర్గాదేవికి విశేష పూజలు చేస్తూ.. అమ్మవారి ప్రసన్నం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ అత్యంత భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇంద్రకీలాద్రీపై వెలసిన కనదుర్గమ్మ ఆలయాల్లో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.
కరోనావైరస్ని అరికట్టేందుకు యావత్ దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో జనం అంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దేవాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో నవరాత్రుల సందర్భంగా మహిళలు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలా తమ తమ ఇంట్లోని బాల్కనీల నుండే దుర్గాదేవికి హారతి ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.