Navratri Day 7: శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
Navratri 2020 day 7: Worship sri mahalakshmi devi on Singnificance: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా సప్తమినాడు ఏడోరోజు (Navratri Day 7) శుక్రవారం కనకదుర్గా దేవీ ‘కాళరాత్రి’ (Maata Kalratri) శాక్తేయానుసారముగా శ్రీ మహాలక్ష్మి దేవి (sri mahalakshmi devi ) అవతారంలో భక్తులను అనుగ్రహించనుంది. దుర్గామాత కాళరాత్రి స్వరూపాన్ని దాల్చి నల్లగా.. ఎగసిపడుతున్న కురులతో మెరుపు తీగను హారంగా ధరించి భయానకంగా ప్రజ్వరిల్లుతుంది. గాడిదను వాహనముగా చేసుకుని మూడు కళ్లలతో నాలుగు భుజములతో అమ్మవారు భక్తులకు ప్రసన్నమవుతుంది. శాక్తేయానుసారముగా ఇంద్రకీలాద్రీ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో రెండు చేతుల్లో కమలాలను, మరో రెండు చేతుల్లో అభయ వరధ హస్త ముద్రలను చూపిస్తూ.. ఇరువైపులా గజరాజుల సపర్యల మధ్య.. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో తేజోమయంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తుంది.
[[{"fid":"195643","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kalaratri devi","field_file_image_title_text[und][0][value]":"కాళరాత్రి రూపంలో అమ్మవారు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kalaratri devi","field_file_image_title_text[und][0][value]":"కాళరాత్రి రూపంలో అమ్మవారు"}},"link_text":false,"attributes":{"alt":"kalaratri devi","title":"కాళరాత్రి రూపంలో అమ్మవారు","class":"media-element file-default","data-delta":"1"}}]]
శ్రీ మహాలక్ష్మి దేవి సర్వమంగళ స్వరూపిణి, ఐశ్వర్య ప్రదాయిని.. అమ్మవారిని నిష్టంగా పూజలు చేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తుల్లో అపార విశ్వాసం. అంతేకాకుండా సర్వజీవులలో ఉండే లక్ష్మీ స్వరూపం కావున ఈ దేవిని పూజిస్తే సర్వమంగళములు కలుగుతాయి. భయాన్ని పొగట్టి ఈ తల్లి ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదిస్తుంది. అందుకే ఈ దేవిని "శుభంకరి" అని కూడా అంటారు. అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మి దేవి.. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మిగా భక్తులను కరుణిస్తుంది. కావున భక్తులు ఈ అమ్మవారికి నువ్వుల అన్నం, చక్రపొంగలి, పూర్ణాలు, పాయసం, పులిహోరను నైవేద్యంగా సమర్పించి కొలుస్తారు. Also read: Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు
కోర్కెలు తీర్చే.. మహాలక్ష్మి దేవి కటాక్షానికి పఠించవలసిన శ్లోకం..
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ
భూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
[[{"fid":"195645","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahalakshmi devi","field_file_image_title_text[und][0][value]":"లక్ష్మి దేవి అవతారం"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mahalakshmi devi","field_file_image_title_text[und][0][value]":"లక్ష్మి దేవి అవతారం"}},"link_text":false,"attributes":{"alt":"mahalakshmi devi","title":"లక్ష్మి దేవి అవతారం","class":"media-element file-default","data-delta":"2"}}]]
ఇదిలాఉంటే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనకదుర్గా దేవి భక్తులకు శ్రీ మహాలక్ష్మి దేవిగా అనుగ్రహించనుంది. విజయవాడ ఇంద్రకీలాద్రీపైనున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో ప్రసన్నం కానుండటంతో భక్తులు అమ్మారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శ్రీ మహాలక్ష్మి స్వరూపంలోనున్న అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పిస్తూ కుంకుమార్చనలు చేయిస్తున్నారు. Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe