Navratri 2021: దేశంలోని చాలా రాష్ట్రాలలో నవరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో చాలా మంది ఉపవాసాలు దీక్షలు చేస్తుంటారు.  ఆరోగ్యం, కుటుంబ క్షేమం గురించి ఉపవాస దీక్షలు, పూజలు చేస్తుంటారు, కానీ కొంత మంది వారికి తెలియకుండానే కొన్ని రకాల తప్పులు చేసి, పూజా ఫలాన్ని పొందకపోవటం, కోరుకునేది జరగపోవటం వంటివి జరుగుతునాయి. పవిత్రమైన నవరాత్రి సమయంలో మీరు కూడా ఉపవాసం ఉంటే, ఈ ముఖ్యమైన నియమాలను తెలుసుకొని,నిక్కచ్చిగా వాటిని పాటించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉపవాస సమయంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు
ఉపావాసం అంటే అన్నం తినకపోవడం లేదా ఆహరం తినకపోవడం మాత్రమే కాదు, మనసును పరిశుద్ధంగా ఉంచుకోవటం. ఉపవాస సమయంలో, మీ దృష్టిని ఏకాగ్రతను దేవుడిపై ఉంచటం మరియు నియమాల ప్రకారం పూజించడం ద్వారా మాత్రమే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. కావున కింద పేర్కొన్న నియామాలను తప్పక పాటించండి.


Also Read: MAA Elecrtions 2021: ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు రవి బాబు


పాటించాల్సిన నియమాలు:
-నవరాత్రి మొదటి రోజు నియలమాల ప్రకారం ఘటస్తాపన చేయండి
-నవరాత్రి రోజుల్లో ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించండి, ఆపై పూజ మందిరాన్ని కూడా శుభ్రం చేయండి. 
-నవరాత్రి మిగతా రోజులన్ని నియమాల ప్రకారం రోజూ పూజించండి.
-ఉదయం కాకుండా, సాయంత్రం కూడా నెయ్యి దీపంతో అమ్మావారికి ఆరతి ఇవ్వండి. 
-అఖండ జ్యోతి వెలిగిస్తే, దానిని 9 రోజుల పాటు వెలిగేలా తగిన ఏర్పాట్లు చేసుకోండి. చివరి రోజు ఆరాధన తర్వాత దానిని మీరు చల్లార్చవద్దు, అదే స్వయంగా చల్లబడే వరకు వేచి చూడండి.


Also Read: Viral News: ఎలక్ట్రానిక్ వస్తువులు ఆర్డర్ చేస్తే 'ఇటుక ముక్క, డెటాల్ సబ్బు, ఘడీ సబ్బు' వచ్చాయి


-రోజులో ఎప్పుడు సమయం దొరికినా, ప్రతిరోజూ దుర్గా సప్తశతి పఠించండి మరియు మంత్రాన్ని జపించండి.
-ఉపవాసంలో పండ్లు తినండి, పొరపాటున కూడా ఇతర ఆహార పదార్థాలను తినవద్దు.
-కల్మషం లేని పవిత్రమైన మనసుతో పూజించే వారిని మాత్రమే దుర్గా మాత ఆశీర్వదిస్తుంది. కావున ఉపవాస సమయంలో ఎవరిపైన కోపగించుకోవద్దు మరియు బూతులు తిట్టకూడదు.
-ఈ సమయంలో జుట్టు మరియు గోళ్లను కత్తిరించవద్దు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook