Navratri Colours 2022: ఇవాల్టి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ శరన్నవరాత్రులు అక్టోబర్ 5 అంటే దసరాతో ముగుస్తాయి. ఈ 9 రోజులు భక్తులు దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. నవరాత్రి 9 రోజులు దుర్గాదేవి (Goddess Durga) యెుక్క పది రూపాలను పూజిస్తారు. అవి దుర్గామాత, మాతా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవరాత్రులలో (Navratri 2022) ఒక్కోరోజు ఒక్కో అమ్మవారిని పూజిస్తారు. కాబట్టి చాలా మంది ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను ధరిస్తారు.  ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలు బలపడతాయి. అంతేకాకుండా దుర్గామాత మీ  కోరికలను నెరవేరుస్తుంది.  నవరాత్రులలో ఏ రోజు ఏ రంగును ధరించాలో తెలుసుకుందాం.


1వ రోజు: నవరాత్రి మొదటి రోజు మాతా శైలపుత్రిని పూజిస్తారు. ఈ రోజు పసుపు రంగును ధరించండి. దీంతో జీవితంలో ఆనందం, ఉత్సాహం పెరుగుతాయి.
2వ రోజు: నవరాత్రి రెండో రోజు తల్లి బ్రహ్మచారిణికి ఆరాధిస్తారు. ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించండి. ఇది జీవితంలో పురోగతిని తెస్తుంది. 
3వ రోజు: నవరాత్రుల మూడో రోజు చంద్రఘంట తల్లిని కొలుస్తారు. బ్రౌన్ లేదా గ్రే కలర్ దుస్తులను ధరించండి. ఇది మీ యెుక్క చెడు అలవాట్లను తొలగిస్తుంది.
4వ రోజు: నవరాత్రి నాల్గో రోజున మాతా కూష్మాండను పూజిస్తారు. నారింజ రంగు దుస్తులు ధరించండి. ఇది జీవితంలో ఆనందం,సానుకూలతను తెస్తుంది.
5వ రోజు: నవరాత్రి ఐదవ రోజు తల్లి స్కందమాతకు అంకితం చేయబడింది. ఈ రోజున తెలుపు రంగును ధరించండి. ఇది జీవితంలో ఆనందం, శాంతి, ఏకాగ్రత మరియు సానుకూలతను పెంచుతుంది.
6వ రోజు: నవరాత్రులలో ఆరో రోజు మాతా కాత్యాయనికి కొలుస్తారు. ఈమె యుద్ధ దేవతగా పరిగణించబడుతుంది. ఈ తల్లి యొక్క ఈ రూపం మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపింది. ఈ రోజు ఎరుపు రంగును ధరించండి. ఇది విజయం మరియు శక్తి యొక్క కలర్.
7వ రోజు: నవరాత్రులలో ఏడో రోజున మాతా కాలరాత్రిని పూజిస్తారు. అమ్మ యొక్క ఈ రూపం రాక్షసులను నాశనం చేస్తుంది. ఈ రోజున నీలం రంగును ధరించండి. ఇది అన్ని భయాలను తొలగిస్తుంది.  
8వ రోజు: నవరాత్రి ఎనిమిదో రోజు మాతా మహాగౌరీకి అంకితం చేయబడింది. ఈ రోజు గులాబీ రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి జీవితం బాగుంటుంది.
9వ రోజు: నవరాత్రుల చివరి తొమ్మిదవ రోజు మాతా సిద్ధిదాత్రిని ఆరాధిస్తారు. ఈ రోజున ఊదా రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు. ఇది మీ ఆశయాలను నెరవేరుస్తుంది.


Also Read: Navratri 2022: నవరాత్రుల్లో చేయకూడని పనులు ఇవే.. చేశారో ఇక మీ పని అంతే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook