Dreams in Navratri 2023: నవరాత్రి సమయంలో కలలో దుర్గాదేవి కన్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా
Dreams in Navratri 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి విశిష్టత, మహత్యం ఉన్నాయో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం కలలకు అర్ధాలు, పరమార్ధాలు ఉంటాయంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Dreams in Navratri 2023: స్వప్నశాస్త్రం కలల్ని తేలిగ్గా తీసిపారేయవద్దంటోంది. ప్రతి కలకు ఓ అర్ధం లేదా సంకేతం ఉందంటోంది. జ్యోతిష్యానికి ప్రాధాన్యత ఉన్నట్టే స్వప్నశాస్త్రం కూడా విశిష్టమైందంటున్నారు. ప్రస్తుతం నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఎవరికైనా దుర్గాదేవి కలలో కన్పిస్తే దానర్ధం ఏంటనేది పరిశీలిద్దాం.
కలల్లో కన్పించే ప్రతి వస్తువు లేదా పదార్ధం లేదా వ్యక్తి ఏదైనా సరే అది భవిష్యత్తులో జరిగే మంచి లేదా చెడుకు సంకేతమనేది స్వప్నశాస్త్రం చెబుతున్న మాట. ఈ క్రమంలో సాక్షాత్తూ దుర్గాదేవి కన్పిస్తే ఏం జరుగుతుందనేది మరింత ఆసక్తి కల్గించే అంశం. ఎందుకంటే ప్రతి వ్యక్తకి జీవితంలో కలలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్తులో జరిగే చాలా ఘటనల గురించి ముందుగానే సంకేతాలు అందుతుంటాయి. ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఏం జరగనుందనేది కలల ద్వారా తెలుస్తుందంటారు. కొన్ని కలల్ని మనం మర్చిపోతుంటాం. కొన్ని అదే పనిగా వెంటాడుతుంటాయి.
స్వప్నశాస్త్రం ప్రకారం చాలా సందర్భాల్లో కొంతమందికి కలలో దేవీ దేవతలు సైతం దర్శనమిస్తుంటారు. అయితే దేవీ దేవతల్ని ఏ రూపంలో చూశామనేది అతి ముఖ్యం. దానిని బట్టి ఆ కల అర్ధం మారిపోతుంది. ప్రస్తుతం నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దుర్గాదేవి కలలో కన్పించడం ఎలాంటి సంకేతాలనిస్తుందో తెలుసుకుందాం.
దసరా నవరాత్రులు మొదలయ్యాయి. ఈ సమయంలో ఎవరికైనా కలలో దుర్గాదేవి దర్శనమిస్తే ఇక మీకు తిరుగులేదని అర్ధం. మీ కష్టాలన్నీ దూరమైపోతాయని అర్ధం. అదే వ్యక్తికి దుర్గాదేవి ఆగ్రహంగా ఉన్నట్టు కలలో కన్పిస్తే, ఆ వ్యక్తి ఏదో తప్పు చేసినట్టు, ఆ తప్పుని సరిదిద్దుకోమని దుర్గాదేవి ఆదేశిస్తున్నట్టు అర్ధం. దుర్గాదేవి ప్రసన్న వదనంతో కన్పిస్తే మాత్రం ఇక అంతులేని ధన సంపదలు కలగనున్నాయి. అన్నింటిలో విజయం దక్కుతుంది. కలలో విష్ణు భగవానుడిని చూస్తే మాత్రం ఆ వ్యక్తి కెరీర్ లేదా వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడని అర్ధం. అంటే ఎందులో అడుగుపెట్టినా విజయం లభిస్తుంది.
ఒకవేళ ఎవరైనా వ్యక్తికి కలలో శ్రీకృష్ణుడు కన్పిస్తే ఆ వ్యక్తి బ్రహ్మచారి అయితే వెంటనే పెళ్లి జరుగుతుందని అర్దం. అదే పెళ్లైన వ్యక్తులకు కన్పిస్తే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుందట. ఎవరైనా వ్యక్తికి కలలో శివుడు కన్పించడం కూడా ఆ వ్యక్తి అభివృద్ధికి సంకేతమని అర్ధం. ఆ వ్యక్తి ఎదుగుదలకు ఉన్న మార్గాలన్నీ ఒకదానివెంట మరొకటి తెర్చుకుంటాయి. శివలింగం కన్పిస్తే ఆగిన పనులన్నీ పూర్తవుతాయి.
Also read: Mercury Transit 2023: బుధుడి రాశి పరివర్తనంతో రేపట్నించి ఈ 5 రాశులపై కనకవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook