Mercury Transit 2023: బుధుడి రాశి పరివర్తనంతో రేపట్నించి ఈ 5 రాశులపై కనకవర్షం

Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల ప్రతి కదలికకు ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించినప్పుడు అన్ని రాశులపై ఆ ప్రభావం పడి వ్యక్తుల జాతకం మారుతుందంటారు. అలాంటిదే బుధ గ్రహ గోచారం. బుధుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 18, 2023, 06:24 AM IST
Mercury Transit 2023: బుధుడి రాశి పరివర్తనంతో రేపట్నించి ఈ 5 రాశులపై కనకవర్షం

Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. సూర్యుడిని గ్రహాల రాజుగా పిల్చినట్టే బుధ గ్రహాన్ని గ్రహాల రాజకుమారుడిగా పరిగణిస్తారు. అలాంటి బుధ గ్రహం అక్టోబర్ 19 అంటే రేపు తులా రాశిలో ప్రవేశించనున్నాడు. బుధుడి గోచారంతో 5 రాశుల కెరీర్ అత్యంత లాభదాయకం కానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

అదే సమయంలో బుధ గ్రహాన్ని బుధ్ది, తెలివితేటలు, వ్యాపారం వంటి విషయాలకు కారకుడిగా భావించడం వల్ల కుండలిలో బుధుడి స్థితి ఈ అంశాల్ని ప్రభావితం చేస్తుంది. బుధుడు శుభమైన అంటే బలమైన స్థితిలో ఉంటే వ్యాపారం విస్తృతమౌతుంది. ఊహించని లాభాలు ఆర్జిస్తారు. బుధుడు అక్టోబర్ 19వ తేదీ రాత్రి 1 గంట 16 నిమిషాలకు కన్యా రాశి నుంచి బయటపడి తులా రాశిలో ప్రవేశించనున్నాడు. తులా రాశి అనేది శుక్రుడి రాశి. ఆ తరువాత ్క్టోబర్ 22న స్వాతి, అక్టోబర్ 31న విశాఖ నక్షత్రంలో బుధుడి గోచారముంది. ఆ తరువాత తుల రాశి నుంచి బయటికొచ్చి వృశ్చికంలో ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ నెలాఖరు వరకూ  వ్యాపారంలో ఎగుడు దిగుడు ఎదుర్కోవల్సి వస్తుంది. 5 రాశులవారికి మాత్రం అద్భుతమైన లాభాలు ఆర్జించనుంది.

మకర రాశి జాతకులకు బుధుడి రాశి పరివర్తనం ప్రభావం సానుకూల పరిణామాలు కల్గించనుంది. వ్యాపారులకు అధిక లాభాలు కలగనున్నాయి. పూర్వీకుల నుంచి సంపద లాభించవచ్చు. కెరీర్‌పరంగా అయితే వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ క్రమంలో కీలకమైన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. 

బుధుడి గోచారం ప్రభావం కుంభ రాశి జాతకులపై తీవ్రమైన ప్రభావం చూపించనుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగులో ఉన్న డబ్బులు ఊహించనివిధంగా చేతికి అందుతాయి. ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి సిద్ధిస్తుంది. వ్యాపారులు అద్భుత లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. 

బుధుడి తులా రాశి ప్రవేశం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. అన్ని రంగాల్లో విజయం ఈ రాశి జాతకులదే అవుతంది. బుధుడి గోచారం ఊహించని ధనలాభం కల్గిస్తుంది. పెండింగులో లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. బుధుడి గోచారం మిధున రాశి జాతకులకు అన్నివైపుల్నించి లాభదాయకంగా ఉండనుంది. 

ధనస్సు రాశి జాతకులకు బుధుడి రాశి పరివర్తనంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. వ్యాపారం పెరగడంతో సమాజంలో గౌరవంతో పాటు ఆర్ధికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఈ పదిహేను రోజులు వ్యాపారులకు చాలా అనువైన సమయం. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతి ఉంటుంది. 

బుధుడి గోచారంతో కన్యా రాశి జాతకులకు అంతా కలిసొస్తుంది. ఆకశ్మిక ధనలాభం కుబేరుల్ని చేస్తుంది. అక్టోబర్ 19 నుంచి బుధుడు ఈ రాశి జాతకులపై కనకవర్షం కురిపిస్తాడంటారు. చేపట్టిన అన్ని పనులు విజయవంతమౌతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ విధమైన సమస్య ఎదురుకాదు. 

Also read: Grah Gochar 2023: దీపావళికి ముందు ఈ 4 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News