Navratri Puja Rules: మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబరు 26 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఇది అక్టోబరు 5 దసరాతో ముగుస్తాయి. ఈ నవరాత్రులనే శరన్నవరాత్రులు లేదా శరద్ నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు (Shardiya Navaratri 2022) అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు దుర్గామాత యెుక్క 9 రూపాలను పూజిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో దుర్గా నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ నవరాత్రులకు చాలా మంది భవానీ మాలలు వేస్తారు. అయితే ఈ టైంలో అమ్మవారిని పూజించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పాటించకపోతే దుర్గాదేవి అనుగ్రహం మీకు లభించదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ విషయాలు గుర్తించుకోండి...
చాలా మంది నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉంటారు. అయితే కొంత మంది అనారోగ్యం లేదా వీలుకాకపోవడం కారణంగానే పూజలు చేయలేరు. అటువంటి సమయంలో కూడా పూజలు చేయవద్దు. అయితే పూజ ఎలా చేయాలో తెలుసుకోండి. మనం తరుచూ దుర్వా గడ్డిని పూజలో ఉపయోగిస్తాం. నవరాత్రుల సమయంలో అమ్మవారి పూజలో దుర్వాగడ్డిని ఉపయోగించవద్దు. పూజా గది యెుక్క రెండు తలుపులపైనే స్వస్తిక చిహ్నాం వేసి.. దానిపై కుంకుమ రాయండి. నవరాత్రులలో దుర్గా సప్తశతి పారాయణం చేయండి. నవరాత్రుల్లో తల్లికి భోగ్‌గా ప్రతిరోజూ పండ్లను పెట్టండి. 


Also Read: Navratri 2022 Date: శరన్నవరాత్రుల్లో ఈ పీఠాలను దర్శిస్తే చాలు.. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook