Neem Remedies: శని, కేతు దోషాల్నించి విముక్తి కోసం వేప ఎలా ఉపయోగపడుతుంది
Neem Remedies: వేపతో జ్యోతిష్యపరంగా కూడా చాలా ఉపయోగాలున్నాయి. కుండలిలో కేతు, శని, పిత్రు దోషాలుంటే వేప సహాయంతో విముక్తులవచ్చు.
Neem Remedies: వేపతో జ్యోతిష్యపరంగా కూడా చాలా ఉపయోగాలున్నాయి. కుండలిలో కేతు, శని, పిత్రు దోషాలుంటే వేప సహాయంతో విముక్తులవచ్చు.
జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి దోషం నుంచి విముక్తులయ్యే చాలా మార్గాలున్నాయి. ఈ మార్గాల్ని ఆచరిస్తే..వ్యక్తి సంబంధిత దోషం నుంచి విముక్తుడవుతాడు. ఇందులో చెట్లతో కలిగే ఉపయోగాలు కూడా ఉన్నాయి. వేప చెట్టుకు సంబంధించిన కొన్ని ఉపాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..వేపచెట్టుకు ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వేపచెట్టు సంబంధం మంగళగ్రహంతో ముడిపడి ఉంది. దాంతోపాటు..కేతు, శని గ్రహంతో కూడా ఉంది. ఒకవేళ మీరు వేపచెట్టు నాటాలంటే..ఇంటి బయట దక్షిణ దిశలో నాటాల్సి ఉంటుంది.
అటు వేప కలపకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. వేప కలపతో చాలా రకాల దోషాలు పోతాయని విశ్వాసం. వేప చెట్టు ఉపయోగాలు, ఏయే దోషాల్నించి విముక్తులు కావచ్చో తెలుసుకుందాం..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వెపచెట్టు సంబంధం శని, కేతు గ్రహాలతో ముడిపడి ఉంది. అందుకే ఒకవేళ ఎవరి జాతకంలోనైనా కుండలిలో శనిదోషం లేదా కేతు దోషం లేదా శనిదోషముంటే..ఈ రెండు దోషాల్ని శాంతింపజేసేందుకు వేపను ఉపయోగిస్తారు. దీనికోసం వేప కర్రను దహనం చేయాలి. ఇలా చేస్తే శనిగ్రహం శాంతిస్తుంది. వారంలో ఒకసారి వేప కలపను దహనం చేయడం తప్పనిసరి. అటు కేతు గ్రహం శాంతింపజేసేందుకు వేప ఆకుల రసం తీసి..స్నానం నీళ్లలో కలిపి స్నానమాచరించాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి అన్ని సమస్యల్నించి విముక్తుడవుతాడు.
వేపను పూజిస్తే హనుమంతుడు ప్రసన్నమౌతాడని విశ్వాసం. భక్తులపై కారుణ్యం కురిపిస్తారని అంటారు. అందుకే నియమబద్ధంగా వేపచెట్టుకు నీళ్లు అర్పించాలి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో వేప చెట్టు తప్పకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుంది. వేపచెట్టును దుర్గాదేవికి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. అందుకే వేపను నీమ్రీ దేవి అని కూడా పిలుస్తారు.
కుండలిలో పిత్రుదోషముంటే ఇంట్లో దక్షిణ దిశ లేదా వాయువ్యదిశలో వేపచెట్టు తప్పకుండా నాటాలి. దీనివల్ల పితృదోషం తొలగిపోతుంది. దాంతోపాటు పిత్రుల ఆశీర్వాదం లభిస్తుంది. శని మహర్దశ సందర్భంగా వేప కలపతో మాల చేసి ధరిస్తే మంచిది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని మహర్ధశ ప్రభావం తగ్గి..శుభకార్యాలు ప్రాప్తిస్తాయి.
Also read: Shani pooja Vidhanam: శనిదేవుడిని ఎలా పూజించాలి, పద్ధతి తప్పితే శని ఆగ్రహం తప్పదు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook