New Year 2023 Remedy: న్యూ ఇయర్ కు కౌంటడౌన్ మెుదలైంది. మరో 48 గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. 2023 ఏడాది తమకు ఎలా ఉండబోతుందోనని అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. నూతన సంవత్సరం మొదటి రోజున చేయకూడని, చేయవల్సిన కొన్ని పనులు గురించి ఆస్ట్రాలజీలో చెప్పబడ్డాయి. ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి.  అవేంటో తెలుసుకుందాం. 
2023 సంవత్సరం తొలి రోజు చేయకూడని పనులు..
>> కొత్త సంవత్సరం మొదటి రోజు ఇతరులతో వాదించకండి.
>> ఈరోజు పెద్దలను గౌరవించండి మరియు ఎవరినీ అవమానించవద్దు.
>> 2023 మొదటి రోజున నల్లని బట్టలు వేసుకోకూడదు మరియు స్త్రీలు తెల్లని బట్టలు ధరించకూడదు.
>> మద్యం తీసుకోకండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడతారు.  
>> కొత్త ఏడాది తొలి రోజున పదునైన వస్తువులను ఇంట్లోకి తీసుకురావద్దు లేదా వాటిని ఉపయోగించవద్దు.
>> ఈ రోజున పర్స్ ఖాళీగా ఉంచడం వల్ల ఏడాది పొడవునా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని నమ్ముతారు.
>> సంవత్సరం మొదటి రోజున ఇంటిని చీకటిగా ఉంచవద్దు, దీని వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 మొదటి రోజున ఇలా చేయండి..
>>
కొత్త సంవత్సరం తొలిరోజు స్నానం చేసిన తర్వాత నుదుటికి కుంకుమ పెట్టుకోవడం పవిత్రంగా భావిస్తారు. 
>> కొత్త ఏడాది మెుదటి రోజున ఆకుపచ్చ రంగు కంకణాలు ధరించడం వల్ల మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 
>> ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ కోసం గాయత్రీ మంత్రాన్ని 31 సార్లు జపించండి.
>> 2023 తొలి రోజున హునుమంతుడిని పూజించి, ఆదేవుడికి చోళాన్ని సమర్పించండి. దీంతో భజరంగి బలి సంతోషిస్తాడు. 
>> నూతన సంవత్సరం తొలి రోజున తులసి మెుక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు. 
>> కొత్త సంవత్సరం తొలిరోజు ఆదివారం రాబోతోంది. ఈరోజున సూర్యభగవానుని పూజించి అర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల మీరు శుభఫలితాలను పొందుతారు. 


Also Read: Budh Vakri 2023: తిరోగమనంలో బుధుడు.. 2023లో ఈ 3 రాశుల భవితవ్యం మారడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.