Remedies For Good Luck:  2023 వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మన దేశ ప్రజలు బాణాసంచా పేల్చుతూ, కేక్ లు కట్ చేస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో (New year 2023) మంచి జరగాలని కోరుకుంటూరు. అందుకు అనుగుణంగానే ఫ్లాన్ చేసుకుంటారు. అయితే కొత్త ఏడాది తొలి రోజున (జనవరి 1) ఇవి తినడం వల్ల అదృష్టం సంవత్సరమంతా ఉంటుందని కొన్ని దేశాల్లో నమ్ముతారు. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ కేక్ తింటే అదృష్టమట..
సాధారణంగా పెళ్లిళ్లుకు, పుట్టినరోజుకు మరియు వార్షికోత్సవాలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో కేక్‌లను కట్ చేస్తూంటాం. అయితే కొత్త సంవత్సరం తొలి రోజు అంటే జనవరి 1, సాయంత్రం కేక్ తింటే ఏడాది పొడవునా అదృష్టం ఉంటుందని గ్రీస్ ప్రజలు నమ్ముతారు. అలాగే ద్రానిమ్మ గింజలను తినడం కూడా వీరు లక్ గా భావిస్తారు.


పండ్లు కూడా లక్ ను ఇస్తాయట..
స్పెయిన్ మరియు మెక్సికోలలో జనవరి మొదటి సాయంత్రం పండ్లను తినడం వల్ల సంవత్సరమంతా అదృష్టం ప్రకాశిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఈ దేశాల్లోని ప్రజలు సాయంత్రం పూట పండ్లు తిని సంబరాలు చేసుకుంటారు. ఎక్కువగా ద్రాక్ష పళ్లను తీసుకుంటారు. 


నూడుల్స్ అదృష్టాన్ని తెస్తాయి..
నూడుల్స్ పేరు చెప్పగానే చైనా, జపాన్ గుర్తుకు వస్తాయి. చైనా మరియు జపాన్లలో నూడుల్స్ యొక్క పొడవు ప్రజల దీర్ఘాయువుతో పోలుస్తారు. జనవరి 1 సాయంత్రం నూడుల్స్ తింటే ఏడాదింతా అదృష్టం ఉంటుందని ఈ దేశాల ప్రజలు నమ్ముతారు. 


Also Read: Shukra Gochar: 2023లో శుక్రుడి సంచారం... ఏడాది పొడవునా మీకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.