Nirjala Ekadashi 2023: నేడే నిర్జల ఏకాదశి.. వ్రతం ఇలా చేస్తే సంపన్నులు అవ్వటం ఖాయం
Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశిని రోజు వ్రతాన్ని ఆచరించేవారు తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నది స్నానం కూడా ఆచరించాల్సి ఉంటుంది.
Nirjala Ekadashi 2023 Significance: నిర్జల ఏకాదశిని హిందువు సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఈ ఏకాదశిని మాసంలోని శుక్ల పక్షంలోని 11వ రోజు జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు శుక్ల పక్షంలోని శుభ సమయాల్లో రెండవ రోజు.. కాబట్టి ఈ రోజు నిర్జల ఏకాదశిని జరుపోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏకాదశి తిథి మే 30వ తేదీ మధ్యాహ్నం 01:09 గంటలకు ప్రారంభం కావడంతో 31 మే తేది సూర్యోదయ సమయంలో ఉపవాసాలు పాటించవచ్చని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
నిర్జిల ఏకాదశి రోజును జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన శుభ సమయాల్లో మాత్రమే పూజ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో పాటు, ఉపవాస వ్రతాన్ని పాటించడం వల్ల శ్రీ మహా విష్ణువును అనుగ్రహం అభిస్తుందని నమ్మకం.. అంతేకాకుండా అన్ని పాపాలు దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
నిర్జల ఏకాదశి 2023 శుభ సమయాలు ఇవే:
మే 30 మధ్యాహ్నం 01.09 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది.
మే 31 మధ్యాహ్నం 01.45 గంటలకు తిథి ముగుస్తుంది.
జూన్ 01 ఉదయం 05.24 నుంచి 08.10 వరకు వ్రత పారాయన సమయం.
జూన్ 01 మధ్యాహ్నం 01.40 గంటలకు ద్వాదశి తిథి ముగింపు సమయం.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
వ్రత సమయం:
మే 30వ తేదీ మధ్యాహ్నం 01:09 గంటలకు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించవచ్చు.
జూన్ 1 మధ్యాహ్నం 01:40 గంటలకు ద్వాదశి తిథి ముగుస్తుంది.
నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత:
జ్యేష్ఠ శుక్ల ఏకాదశి భారత్ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాముఖ్య కలిగి ఉంది. ఈ వ్రతాన్ని పాటించేవారు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా లక్ష్మి దేవితో పాటు మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ద్వాదశి తిథి రోజున ఉపవాసం విరమించే క్రమంలో మరో సారి స్వామి వారిని పూజించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఉపవాస నియమాలు:
ఉపవాసం పాటించేవారు తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేవాలి. మీ దగ్గరలో ఉన్న గంగా నదికి వెళ్లి నది స్నానం ఆచరించాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజా గదిలో ఉన్న లక్ష్మి దేవి, మహా విష్ణువు విగ్రహాలకు అభిషేకం చేసి.. పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. పూజాలో భాగంగా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చదువుతూ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి