Shami Plant Importance According to the Vastu Worshiping: హిందూ సంప్రదాయంలో తులసి మొక్క (Tulsi Plant) చాలా పవిత్రమైన మొక్కగా  పరిగణించబడుతుంది. దాదాపు అందరి ఇళ్లలో తులసి మొక్క పూజలు అందుకోబడుతుంది. అయితే తులసి కాకుండా ఇంకో మొక్క కూడా ఇంట్లో ఉంటే చాలా లాభదాయకమని శాస్త్రీయ విజ్ఞానులు చెప్తున్నారు. అదే జమ్మి చెట్టు (Shami Plant).. జమ్మి చెట్టును ఇంట్లో నాటితే.. సంతోషం, ఐశ్వర్యం కలగడమే కాకుండా డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా  ఈ మొక్క ఇంట్లో ఉంటే శని దేవుడి చూపు మన పైన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధన లాభం అధికంగా ఉంటుంది 
జమ్మి చెట్టు శని దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టుగా పరిగణించబడుతుంది కావున.. వాస్తు ప్రకారం.. జమ్మి చెట్టు ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలతో మరియు ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా ఉంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే శని దేవుడి చూపు మన ఇంటిపైన పడదని నమ్ముతారు. అంతేకాకుండా.. మీ ఇంట్లో ఎవరికైన వివాహా సంబంధిత సమస్యలు ఉంటే జమ్మి చెట్టు నాటిన వెంటనే  ఆ సమస్యలు తీరతాయి. 


Also Read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం


జమ్మి చెట్టును ఇంట్లో నాటడానికి ముందు కొన్ని ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వీటిలో మొదటిది ఏంటంటే.. శనివారం రోజు మాత్రమే ఈ మొక్కను నాటడటం ఉత్తమం.. ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చే దసరా పండగ రోజు ఇంట్లో నాటితే మరింత మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. రెండవ విషయం ఏమిటంటే.. పరిశుభ్రమైన మట్టితో మాత్రమే ఈ మొక్కను నాటాలి. 


జమ్మి చెట్టును ఎలా పూజించాలి..??
ఎప్పుడైన సరే జమ్మి చెట్టు ఇంటిలోపల నాటకూడదు.. ఈ మొక్క ఎల్లపుడు మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారం వైపుగా ఉండాలి మరియు మీరు బయటకి వెళ్లేప్పుడు అది మీ కుడి వైపు మాత్రమే ఈ చెట్టు ఉండాలి. అనగా ప్రధాన ద్వారానికి ఎడమవైపున జమ్మి చెట్టు నాటాలి.  ఒకవేళ మీకు ముఖద్వారం వద్ద నాటే అవకాశం లేకపోతే..టెర్రస్ పైన దక్షిణ దిశలో నాటవచ్చు.. లేదా సూర్యకాంతి నేరుగా పడేలా తూర్పు దిశగా 
నాటవచ్చు. 


Also Read: Metal Astrology: రంగు రాళ్లే కాదు.. ఈ రాశివారికి లోహాలు కూడా మంచి ఫలితాలిస్తాయి


ఈ మొక్క ద్వారా మీకు మంచి జరగాలి అనుకుంటే.. రోజు సాయంత్రం ఇంట్లో ఉన్న దేవుడి గదిలో దీపం వెలిగించిన తరువాత జమ్మి చెట్టు ముందు కూడా దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా.. వృధా ఖర్చులు తగ్గుతాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి