Tirumala Break Darshanam Tickets: టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్ల కొనుగోలు కోసం SMS చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. మీరు కూడా తిరుపతి ఏడుకొండల దర్శనానికి వెళ్తున్నారా? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుమల వెళ్లే భక్తులకు దేవస్థానం యాజమాన్యం భక్తులకు శుభవార్త చెప్పింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్ల కొనుగోలు కోసం SMS చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది.ఆఫ్‌లైన్ కోటా కింద వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్‌లను పొందే భక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్ ఫోన్‌లకు చెల్లింపు లింక్ SMS ద్వారా పంపబడుతుంది. 


ఇదీ చదవండి: Pradosha Vratam 2024: ప్రదోషవ్రతం.. ఈ ఒక్కవస్తువు ఇంటికి తెచ్చుకుంటే  మిమ్మల్ని పీడిస్తున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి..  


దీంతో భక్తులు MBC కౌంటర్‌లో ఎక్కువ గంటలు పడిగాపులు కాయకుండా దర్శనం టిక్కెట్‌ను ఫ్లోన్ ద్వారా తీసుకోవచ్చు. భక్తులు UPI, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు లింక్ పై భక్తులు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు చేసి టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.దేవస్థానం అమల్లోకి తెచ్చిన ఈ విధానం భక్తులకు ఊరటనిస్తుంది.తిరుమల తిరుపతి దేవస్థానం రెండు రోజులుగా ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాన్ని కోరింది. 


ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..
ఇదిలా ఉండగా ఈనెలలో రథసప్తమి వేడుకల నేపథ్యంలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్ద చేసింది తిరుమల దేవస్థానం యాజమాన్యం. అంతేకాదు 15, 16, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనం ఇతర ప్రత్యేక దర్శనాలకు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలకు వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook