Pancha Graha Kutami 2024: పంచగ్రహ కూటమి అంటే ఏమిటి.. లాభ, నష్టాలు పొందబోయే రాశులు..
Pancha Graha Kutami 2024: 12 ఏళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీని వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక సమస్యలు వస్తాయి.
Pancha Graha Kutami Effect On Horoscope 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలిసే దృగ్విషయం. ఇది చాలా అరుదుగా జరిగే ఒక సంఘటనగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతున్నారు. సుమారు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని వారంటున్నారు. 2024 జూన్ 5న జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, సూర్యుడు, చంద్రుడుతో పాటు గురు గ్రహాలు మిథున రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ కూటమిని ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ కూటమి జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు రాశులపై భిన్నంగా పడుతుంది. కొన్ని రాశులకు ఇది శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని రాశులకు ఇది కష్టాలను కలిగిస్తుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ కూటమి ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పంచగ్రహ కూటమి ప్రభావాలు:
మిథున రాశి:
మిథున రాశి వారికి పంచగ్రహ కూటమి చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా అదృష్టం పెరుగుతుంది.
వృషభ, కర్కాటక, సింహ రాశులు:
ఈ రాశుల వారికి కూడా పంచగ్రహ కూటమి మంచి ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరికి ఈ సమయంలో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా లభాలు పొందుతారు.
మేష, తుల, ధనుస్సు:
ఈ మూడు రాశులవారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల మిశ్రమ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మకరం, కుంభం, మీన రాశులు:
ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ మూడు రాశులవారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి వీరు తప్పకుండా చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక సమస్యలు వస్తాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
పంచగ్రహ కూటమి సమయంలో తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఈ సమయంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినాల్సి ఉంటుంది. అలాగే పుష్కలంగా నీరు త్రాగాలి.
దీంతో పాటు కోపం, అహంకారం వంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండండి.
ఎవరితోనూ వాదనలు, గొడవలు పడకుండా ఉండడం చాలా మంచిది.
దానధర్మాలు చేయండి, అవసరమైన వారికి సహాయం చేయండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి