Panchaka kalam 2022: మృత్యు పంచకం ప్రారంభమైంది. తస్మాత్ జాగ్రత్త. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచకపు ఐదు రోజులు మంచిది కాదు. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు మరికొన్ని పనులు చేయకూడదు. ఆ వివరాలు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 5 రోజుల్ని మృత్యు పంచకంగా భావిస్తారు. ఈ సమయంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదు. ఈ కాలాన్ని పంచక కాలంగా పరిగణిస్తారు. ఆ ఐదు పంచకాల్లో..రోగ పంచకం, రాజ్ పంచకం, అగ్ని పంచకం, మృత్యు పంచకం, చోర్ పంచకం. ఇందులో మృత్యు పంచకం గురించి ఓ విధమైన భయం నెలకొంది. ఈ నెలకు సంబంధించి మృత్యు పంచకాలు జూన్ 18 నుంచి ప్రారంభమైపోయాయి. జూన్ 23 వరకూ ఉంటాయి.


పంచకం శనివారం నాడు ప్రారంభమైతే వాటిని మృత్యు పంచకంగా చెబుతారు. హిందూమతం, జ్యోతిష్యశాస్త్రంలో ఈ పంచకాలను అశుభంగా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 23 వరకూ ఏ విధమైన శుభ కార్యాలు చేయకపోవడమే కాకుండా..కొన్ని పనుల్నించి దూరంగా ఉండాలి. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 


పంచకకాలంలో చేయకూడని పనులు


పంచకం సమయంలో ఎన్నడూ కలప లేదా కలపతో చేసిన సామాను కొనుగోలు చేయకూడదు. పంచకం సందర్భంగా ఎప్పుడూ ఇంటి కప్పు వేసే పనులు చేయకూడదు. గుమ్మాలు మార్చకూడదు. పంచకం సందర్భంగా మంచం, టీపాయ్, ఫర్నీచర్ కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం అశుభాన్ని వ్యాపింపజేస్తుంది. పంచకం సందర్బంగా ఎవరైనా చనిపోతే..యోగ్యుడైన బ్రాహ్మణుడి సలహా మేరకు విధి విధానాలతో అంతిమ సంస్కారాలు చేయాలి. మృతుడితో పాటు 4 కొబ్బరికాయలు లేదా లడ్డూలు ఉంచి దహన సంస్కారాలు చేయాలి. పంచకం సందర్భంగా ఎప్పుడూ దక్షిణ దిశలో యాత్రలు చేయకూడదు. ఎందుకంటే దక్షిణ దిశ యముడి దిశగా భావిస్తారు. 


జూలై, 2022లో 15 నుంచి 20  బుధవారం వరకూ పంచక కాలం కాగా, ఆగస్టు 2022లో 12 శుక్రవారం నుంచి 16 మంగళవారం వరకూ పంచక సమయంగా ఉంది. ఇక సెప్టెంబర్ 2022లో 9వ తేదీ శుక్రవారం నుంచి 13 మంగళవారం వరకూ పంచకంగా ఉంది. ఇక అక్టోబర్ 2022లో 6వ తేదీ అక్టోబర్ గురువారం నుంచి 10 అక్టోబర్ సోమవారం వరకూ పంచక కాలం ఉంది. నవంబర్ 2022లో 2వ తేదీ నవంబర్ బుధవారం నుంచి 6వ తేదీ ఆదివారం వరకూ పంచక సమయం. ఇక డిసెంబర్ 2022లో 26వ తేదీ సోమవారం నుంచి 31వ తేదీ శనివారం వరకూ పంచకకాలం.


Also read: Rajayogam Effect: 30 ఏళ్ల తరువాత మహాపురుష రాజయోగం, ఆ నాలుగు రాశులవారికి ఐశ్వర్యమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook