Papmochani Ekadashi 2023 Pooja Vidhanam: హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసం కృష్ణ పక్షంలోని ఏకాదశి నాడు పాపమోచని ఏకాదశిని జరుపుకుంటారు. పాపమోచని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇక అంతేకాక పాపమోచని ఏకాదశి తేదీ, ఆరోజు శుభ సమయం అలాగే పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాపమోచని ఏకాదశి 2023 తేదీ అలాగే శుభ సమయం వివరాలు ఇలా ఉన్నాయి 


  • పాపమోచని ఏకాదశి తేదీ: మార్చి 18న జరగనుంది. 

  • ఏకాదశి తిథి ప్రారంభం: మార్చి 17, 2023, మధ్యాహ్నం 02.06 నిమిషాల నుండి

  • ఏకాదశి తిథి ముగింపు : మార్చి 18, 2023, ఉదయం 11.13 వరకు

  • ఉపవాస సమయం: మార్చి 19, 2023, ఉదయం 06.25 నుండి 08.07 వరకు


పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం ఏకాదశిని శ్రీ హరి స్వరూపంగా భావిస్తారు, అలా ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మరణానంతర స్వర్గంతో పాటు ప్రాపంచిక సుఖాలు లభిస్తాయని నమ్ముతారు. ఇక పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి సైతం లభిస్తుంది. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల బ్రహ్మహత్య, బంగారం అపహరించడం, మద్యం సేవించడం వంటి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.


పాపమోచని ఏకాదశి పూజా విధానం


  • పాపమోచని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి. 

  • విష్ణువును ధ్యానిస్తూ ఉపవాస వ్రతం చేయాలి. 

  • విష్ణుమూర్తికి నీరు, పసుపు పుష్పాలు, పసుపు చందనం, అక్షితలు మొదలైన వాటిని సమర్పించండి. 

  • ఆ నైవేద్యం సమర్పించి తర్వాత దీపం వెలిగించండి. 

  • తర్వాత ఏకాదశి వ్రత కథను పఠించండి. 

  • చివరికి, హారతి ఇవ్వండి,

  • ఇక ద్వాదశి రోజున పూజ చేసిన తర్వాత ఉపవాసం విరమించండి.

  • రోజంతా ఏకాదశి ఉపవాసం ఉండి, ద్వాదశి రోజున బ్రాహ్మణులకు పున:పూజలు చేసి దానం చేసిన తర్వాత ఉపవాసం విరమించండి.


Also Read: Surya Grahan 2023: సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ మూడు రాశుల వారు ఇక పట్టిందల్లా బంగారమే!


Also Read: Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు అంటే ఏంటి? వాటిని ఎలా జరుపుకుంటే అమ్మ వారి అనుగ్రహం లభిస్తుంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి