Paush Pradosh Vrat 2022: ఈ ఏడాది చివరి ప్రదోష వ్రతం రేపే, అయితే ఈ తప్పులు చేయకండి
Paush Pradosh Vrat 2022: ఈ ఏడాది చివరి ప్రదోష వ్రతం పుష్యమాసంలో వస్తుంది. అది కూడా రేపే. మరి ఈరోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Paush Pradosh Vrat 2022: హిందూమతంలో ప్రదోష వ్రతానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఏడాది చివరి ప్రదోష వ్రతం రేపు అంటే డిసెంబరు 21న వస్తుంది. ఇది పుష్యమాసంలోని కృష్ణ పక్షం రోజున వస్తుంది. కాబట్టి దీనిని పుష్య ప్రదోష వ్రతమని, బుధవారం నాడు వస్తుంది కాబట్టి దీనిని బుధ ప్రదోష వ్రతమని అంటారు. ఈరోజున శివుడిని (Lord Shiva) ఆరాధిస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే మహాదేవుడికి కోపం వచ్చే అవకాశం ఉంది. పౌష ప్రదోష వ్రతం రోజున పూజలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
శుభ యోగం
అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, ధృతి యోగం ఈ సంవత్సరం చివరి ప్రదోష వ్రతం నాడు ఏర్పడుతున్నాయి. ఈ మూడు యోగాలలో భగవంతుడైన మహాదేవుని పూజించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా మీకు అంతులేని పుణ్యం లభిస్తుంది.
సర్వార్థ సిద్ధి యోగం - 21 డిసెంబర్ 2022, ఉదయం 08.33 - 22 డిసెంబర్ 2022, ఉదయం 06.33
ధృతి యోగం - అర్ధరాత్రి 12.41- 09.26 రాత్రి (21 డిసెంబర్ 2022)
అమృత సిద్ధి యోగం - 21 డిసెంబర్ 2022, ఉదయం 08.33 - 22 డిసెంబర్ 2022, ఉదయం 06.33
ప్రదోష వ్రతం రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
తులసి
ప్రదోష వ్రతంలో మహాదేవునికి తులసి దళాన్ని సమర్పించవద్దు. శివ పురాణం ప్రకారం, శివుని పూజలో తులసిని ఉపయోగించడం నిషేధించబడింది. అసుర రాజు జలంధరుడి భార్య బృందా.. తులసి మొక్కగా మారిందని, శివుడు జలంధరుని చంపాడని, అందుకే శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించవద్దని బృందా చెప్పిందని చెబుతారు.
ఈ వస్తువులను ఉపయోగించవద్దు
రాగి పాత్రతో శివుడికి పాలు అందించవద్దు, దీనికి ఇత్తడి పాత్రను ఉపయోగించండి. శివుడు వినాశనానికి దేవుడు. కాబట్టి ఇతని ఆరాధనలో పసుపు, కుంకుమ, కేతకీ పువ్వులు మహాదేవుని పూజలో నిషేధించబడ్డాయి.
వీటిని తినవద్దు
ప్రదోష వ్రతంలో ఆహార నియమాలు పాటించినప్పుడే పూజా ఫలం లభిస్తుంది. ఈ రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసాహారం వంటి తామస ఆహారాన్ని తినవద్దు. మద్యానికి దూరంగా ఉండండి.
ఈ బట్టలు ధరించకండి..
శివుని పూజలో నల్లని వస్త్రాలు ధరించడం అశుభం. ఇలా చేయడం ద్వారా శివుడు కోపం తెచ్చుకోవచ్చు, దీంతో మీరు పుణ్యానికి బదులుగా పాపంలో భాగమవుతారు. భోలేనాథ్ ను పూజించేటప్పుడు ఆకుపచ్చ, నారింజ లేదా పసుపు ఉతికి శుభ్రమైన బట్టలు ధరించడం మంచిది.
Also Read: Budh Uday 2023: బుధుడి ఉదయం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook