Grah Gochar 2022: అంతరిక్షంలో గ్రహాల కదలికలో మార్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. డిసెంబరు నెల మెుదలుకావడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెలలో సౌర వ్యవస్థలోని ప్రధాన గ్రహాలు, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు తమ రాశిచక్రాలను మార్చబోతున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి.  సూర్య సంచారం వల్ల సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బుధుడు శుభప్రభావం కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. శుక్రుడు మీకు లగ్జరీ లైఫ్ ను ఇస్తాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి సంచారం 2022: డిసెంబర్ నెలలో బుధ గ్రహం తన రాశిని 3సార్లు మార్చబోతోంది. మెుదట డిసెంబరు 3న బుధుడు వృశ్చికరాశి నుండి బయలుదేరి ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. డిసెంబరు 28న మళ్లీ ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం రెండు రోజుల తర్వాత డిసెంబరు 30న బుధగ్రహం మళ్లీ ధనుస్సురాశిలోకి సంచరించనుంది. బుధుడి రాశిలో మార్పుల వల్ల వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. 


శుక్ర సంచారం 2022: డిసెంబర్‌లో  శుక్రుడు రెండుసార్లు తన రాశులను మార్చనున్నాడు. డిసెంబర్ 5వ తేదీ సోమవారం సాయంత్రం 6.07 గంటలకు వృశ్చికరాశి నుండి ధనుస్సు రాశికి ప్రయాణిస్తుంది. దీని తర్వాత డిసెంబర్ 29వ తేదీ గురువారం సాయంత్రం 4.13 గంటలకు శుక్రుడు ధనుస్సు రాశి నుంచి బయటకు వెళ్లి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.


సూర్య సంచారం 2022: గ్రహాల రాజు సూర్యుడు వృశ్చికరాశిని విడిచిపెట్టి.. డిసెంబర్ 16, శుక్రవారం ఉదయం 10.11 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ధను సంక్రాంతి అంటారు. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉంటారు.


ఇతర గ్రహాల స్థానం
బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు కాకుండా, డిసెంబర్ నెలలో కుజుడు వృషభరాశిలో, దేవగురువు బృహస్పతి మీనంలో, సూర్యుని కుమారుడు శని మకరరాశిలో, రాహువు మేషరాశిలో మరియు కేతువు తులారాశిలో సంచరిస్తారు.


Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ వస్తువులను ఉచితంగా కూడా తీసుకోకండి.. తీసుకున్నారో అంతే సంగతులు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.