ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటాడు. మార్చ్ నెలలో చాలా గ్రహాలు గోచారం చేయనున్నాయి. ముఖ్యంగా మార్చ్ 13వ తేదీన మంగళ గ్రహం మిధున రాశి ప్రవేశముంది. ఈ గోచారం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తస్మాత్ జాగ్రత్త, సరిగ్గా 4 రోజుల తరువాత ఈ రాశివారి జీవితంలో అల్లకల్లోలం ప్రారంభం కానుంది. ఈ గ్రహాలు మీ కష్టాల్ని మరింతగా పెంచనున్నాయి. కారణం మంగళ గ్రహం గోచారం. మార్చ్ 13వ తేదీన మిథున రాశిలో ప్రవేశించడం వల్ల వృషభం, మిధునం, వృశ్చికం,ధనస్సు రాశుల జాతకాలపై విపరీత ప్రభావం పడనుంది. ఈ రాశులకు తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి. మంగళ గోచారం కారణంగా శనిగ్రహంతో నవమ పంచమి యోగం ఏర్పడనుంది. గ్రహాలకు సేనాపతిగా పిల్చుకునే మంగళ గ్రహం గోచారంతో కొన్ని రాశులకు అనుకూలం, కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది. ముఖ్యంగా మంగళ గ్రహం మార్చ్ 13వ తేదీ ఉదయం 5 గంటల 33 నిమిషాలకు గోచారం చేసి మే 10వ తేదీ మద్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా ఈ రాశులపై మానసిక ఒత్తిడి కన్పిస్తుంది. 


ధనస్సు రాశి


ఈ రాశివారికి మంగళ గ్రహం 7వ పాదంలో గోచారం వల్ల కొద్దిగా సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఈ సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మీ పేరు ప్రతిష్ఠలు పాడుచేసేందుకు ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇక రక్తపోటు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంపై ధ్యాస అవసరం.


మిధున రాశి


మంగళ గ్రహం గోచారం ఈ రాశివారికి మానసిక, ఆర్ధిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఆఫీసులో కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగస్థులకు బదిలీ ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సమస్యలు రావచ్చు. మాట అదుపులో ఉంచుకోవడం మంచిది. 


వృశ్చిక రాశి


జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి జాతకులకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ గోచారంతో విపరీత రాజయోగ నిర్మాణం జరుగుతుంది. ఈ రాశి జాతకులు మానసిక సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. 


వృషభ రాశి


జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం గోచారంతో వృషభరాశి జాతకులకు అశుభంగా ఉంటుంది. ఈ సందర్బంగా ఈ రాశి జాతకులు తమ వాయిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. పెళ్లైనవారి జీవితంలో సమస్యలు పెరగవచ్చు. ఈ కాలంలో చిన్నారుల సహకారం చాలా అవసరం. ఆఫీసులో సహకారంతో పాటు విబేధాలు రావచ్చు.


Also read: Holi Tips 2023: హోలీ ఇలా విభిన్నంగా జరుపుకుంటే ఆ 3 రాశులకు అంతా ఐశ్వర్యమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook