Holi Tips 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హోలీకు కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి.హోలీని రాశుల ప్రకారం జరుపుకుంటే చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు. అంటే కొన్ని ప్రత్యేమైన రంగుల్ని ఎంచుకుని జరుపుకుంటే అమితమైన లాభాలు కలుగుతాయట.
హోలీని వివిధ రాశుల ప్రకారం జరుపుకుంటే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏయే రంగుల్ని వినియోగించాలి, ఏ రంగుల్ని వినియోగించకూడదనే విషయంపై అవగాహన ఉండాలి. రాశిని బట్టి సూచించిన రంగుల్నే వాడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శనిగ్రహం ప్రసన్నుడై అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయంటారు. రాశి మండలిలో శని గ్రహం అధిపతిగా ఉండే మకర, కుంభ రాశులకు అద్భుత ప్రయోజనాలు చేకురుతాయి. ఈ రాశివారికి అధిపతి శని అయినందున శనిగ్రహం కటాక్షంతో సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి.
మకర రాశి జాతకులు వంకాయ లేదా పసుపు రంగు పూలతో హోలీ జరుపుకోవాలి. రంగుల హోలీని ప్రతి యేటా జరుపుకుంటుంటారు. ఈసారి కాస్త విభిన్నంగా జరుపుకుని చూడండి. రంగుల స్థానంలో వంకాయ లేదా పసుపు రంగు పూలను ఇంట్లో సిద్ధంగా పెట్టుకోండి. వాటిని శుభ్రం చేసిన తరువాత ఓ పాత్రలో వేసి పైన తడి గుడ్డ కప్పేయండి. దీనివల్ల పూలు తాజాదనం కోల్పోకుండా ఉంటాయి. హోలీ రోజున పూల పాత్రను ఇంటి పైకప్పులో ఉంచాలి. పైనుంచి అందరిపై పూల వర్షం కురిపిస్తే అంతా మంచి జరుగుతుంది. పూలు మార్కెట్లో లభించకపోతే గులాల్‌తో హోలీ జరుపుకోండి.
కుంభ రాశి జాతకులు మీ కంటే చిన్నోళ్లకు అబీర్ గులాల్ లేదా సుగంధ తిలకం దిద్ది హోలీ జరుపుకోవచ్చు. ఇలా చేయడమే కాకుండా చిన్నారులకు బహుమతి తప్పకుండా ఇవ్వాలి. బహుమతి అనేది మీ సామర్ధ్యం మేరకు ఇవ్వవచ్చు.
Also read: Laxmi Narsihma Swamy: లక్ష్మీ నరసింహ స్వామి వారికి పెళ్లిచూపులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook