Mangal Or Budh Gochar 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహ కదలికల ప్రభావం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి గ్రహం తన రాశిచక్రాన్ని నిర్ణీత సమయంలో మార్చుకుంటుంది. వచ్చే నెల 13న రెండు పెద్ద గ్రహాలు తమ రాశులను (Grah Gochar 2022) మార్చనున్నాయి. కుజుడు వృషభరాశిలోకి, బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం అన్ని రాశులవారి జీవితంపై ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus)- విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఏ పనిలో తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. 
వృశ్చికం (Scorpio)- బుధ గ్రహం నవంబర్ 13న ఈ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఈ రాశివారు కెరీర్ లో మంచి అవకాశాలను అందుకుంటారు. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారు. 
ధనుస్సు (Sagittarius)- బుధుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల సంచార జాతకంలో సప్తమ మరియు పదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో ప్రజలు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు.


మకరం (Capricorn)- ఈ రాశి వారికి మెర్క్యురీ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. శుభఫలితాలను సాధిస్తారు. కుజ సంచారం కూడా ఆ రాశివారికి అనుకూలంగా ఉంటుంది.  
కుంభం (Aquarius)- ఈ రాశి వారికి నవంబర్ 13 తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ వ్యక్తుల జాతకంలో ఐదవ మరియు ఎనిమిదవ గృహాలకు బుధుడు అధిపతి. అందువల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
కర్కాటకం (Cancer)- ఈ రాశి విద్యార్థులకు కుజుడు సంచారం శుభప్రదంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ  జరుగుతాయి. 


Also Read: Surya Gochar 2022: తులరాశిలోకి సూర్యుడు... ఈ 3 రాశుల వారు దీపావళి నాడు ధనవంతులు అవ్వడం పక్కా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి