Planet Changes in September 2022; సెప్టెంబరు నెలలో కొన్ని గ్రహాలు తమ స్థానాన్ని మార్చబోతున్నాయి. ముఖ్యంగా 4 పెద్ద గ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలో సంచరించనుండగా..6వ తేదీన అంగారకుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబరు 16న సూర్యుడు కన్య రాశిలోనూ, సెప్టెంబరు 22న బుధుడు తులరాశిలోనూ సంచరిస్తారు. అయితే బుధుడు 27వ తేదీ నుండి తులరాశిలో తిరోగమిస్తాడు. ఈ మార్పుల వల్ల 5 రాశులవారు తీవ్ర నష్టాలను చవిచూడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులపై ప్రతికూల ప్రభావం
మిథునం (Gemini): ఈ గ్రహాల సంచారం వల్ల మిథున రాశి వారి కుటుంబ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటి సభ్యులలోని కొందరి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఈ సమయంలో మీరు సహనంతో ముందుకు సాగాలి 
సింహం (Leo): గ్రహాల రాశి మార్పు ఈరాశివారికి మిశ్రమ ఫలితాలను అందించనుంది. ఈ సమయంలో మీ మాటలు ఎవరినైనా గాయపరచవచ్చు.  మీరు కళ, విద్య మొదలైన రంగాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది.
కన్య (Virgo): ఈ నెలలో సూర్యుడు మరియు అంగారకుడు మీ రాశిలో సంచరించబోతున్నారు. మరోవైపు, సెప్టెంబర్ 14 నుండి బృహస్పతి మీ ఐదో ఇంట్లో తిరోగమన కదలికను ప్రారంభిస్తుంది. అందువల్ల, ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఇబ్బందులు తప్పవు. మీ కోపం పెరగవచ్చు. అందుకే కోపాన్ని నియంత్రించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి.  


మకరం (Capricorn): బృహస్పతి ఈ నెలలో మీ రాశిచక్రంలో తిరోగమన కదలికను ప్రారంభిస్తాడు, దీని కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోంటారు. ఈ కాలంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. అదే సమయంల మీ తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు మరియు బృహస్పతి స్థానం కారణంగా, కుటుంబంలో కలహాలు రావచ్చు.  
మీనం (Pisces): మీ ఏడవ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు ఉండటం మరియు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీరు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.  పదకొండవ ఇంట్లో బృహస్పతి యొక్క తిరోగమన కదలిక మీకు లాభం కంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. 


Also Read; Shani Amavasya 2022 Effect: శని అమావాస్య రోజు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook