New Year 2023 Planetary Transit: మరో మూడు రోజుల్లో 2022 సంవత్సరం ముగియనుంది. కొత్త సంవత్సరంలోనైనా మంచి జరగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే 2023 వరకు ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరిలో ఉత్సుకత ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. అంతేకాకుండా ఈ గ్రహాలు కొన్ని శుభ, అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తున్నాయి. వీటి ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్ధ యోగం
జనవరి 1 అంటే ఆదివారం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2023వ సంవత్సరం అశ్వినీ నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ఈ రోజు ఉదయం 7:23 గంటలకు సిద్ధయోగం ఏర్పడుతుంది. ఏదైనా సమస్య పరిష్కరించడానికి ఈ సమయం ఉత్తమమైనదిగా భావిస్తారు. 


శష్ రాజయోగం
కొత్త ఏడాదిలో సూర్యుడు, శని మరియు దేవగురు బృహస్పతి వారి ఇంట్లో ఉంటారు. ఇది శుభ సంకేతాన్ని సూచిస్తుంది. జనవరి 17న శని సంచారం వల్ల శష మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం అనేక రాశుల వారికి శుభవార్త తెస్తుంది. ముఖ్యంగా కుంభం, కన్య, మకరం, మేషం, వృషభ రాశి వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి.


వ్యతిరేక రాజయోగం
జనవరిలోనే వ్యతిరేక రాజయోగం కూడా ఏర్పడుతోంది. దీంతోపాటు సూర్యుడు, బుధుడు మరియు శుక్ర గ్రహాలు కూడా జనవరిలోనే సంచరిస్తున్నాయి. దీంతో కొన్ని రాశులవారు శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఇదే తులా, వృషభం, ధనుస్సు రాశుల వారికి ఈ యోగం ప్రత్యేకంగా ఉండబోతుంది.  


Also Read: Venus Transit 2022: అరుదైన యోగం చేస్తున్న శుక్రుడు.. వీరి ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.