Plants Vastu Tips: వాస్తుశాస్త్రంలో మొక్కలు,చెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలుంటే పాజిటివ్ ఎనర్జీ ప్రసారమౌతుంది. కొన్ని మొక్కలు డబ్బును రప్పిస్తాయి కూడా. అందుకే ఈ ఐదు రకాల మొక్కలు నాటితే చాలు..డబ్బే డబ్బు వచ్చి పడుతుందంటున్నారు జ్యోతిష్య పండితులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తుశాస్త్రం ప్రకారం ఐదు రకాల మొక్కలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంట్లో డబ్బులు నిలవకపోవడం, ఎంత వచ్చినా ఖర్చై పోవడం వంటి సమస్యలున్నప్పుడు ఈ ఐదు రకాల మొక్కలు నాటితో పోయిన డబ్బు తిరిగొస్తుంది. డబ్బు ఆదా అవుతుంది. అంతులేని సంపద వచ్చి పడుతుంది. ఆ ఐదు రకాల మొక్కలేంటి, కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.


వెదురు మొక్క వాస్తుశాస్త్రం ప్రకారం చాలా మంచిది. ఇది ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్మకం. డెకొరేషన్ పరంగా కూడా ఈ మొక్కను వినియోగిస్తారు. వెదురు మొక్కను..ఎర్రటి దారంతో చుట్టి ఉంచాలి. ఇంట్లో కనీసం 7-9 అంగుళాల మొక్కను నాటితే మంచిది. ఇక రెండవది సాధారణంగా ప్రతి ఇంట్లో చూసేది మనీ ప్లాంట్ మొక్క. ఈ మొక్కతో ఇంట్లో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే ఈ మొక్కను సరైన దిశలో ఉంచాలి. మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో ప్రధాన గుమ్మం వద్ద పెడితే మంచిది. లేదా గాజు బాటిల్‌లో ఉంచి..ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్ పెరిగేకొద్దీ ఆ వ్యక్తి జీవితంలో లేదా ఇంట్లో కూడా అభివృద్ధి కన్పిస్తుంది. 


ఇక వాస్తుశాస్త్రం ప్రకారం పవిత్రంగా భావించే మొక్క పసుపు మొక్క. దీనివల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. ఇంట్లో దరిద్రం దూరమౌతుంది. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. షమీ మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటినా మంచి ఫలితాలుంటాయి. ఇంట్లో ఉండటం వల్ల ఆ వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. షమీ మొక్కను పూజించడం వల్ల సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం షమీ మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్క ఇంట్లోకి డబ్బును లాగుతుందని అంటారు. ఈ మొక్క కారణంగా వ్యక్తి జీవితంలో ఉండే శని మెరుగవుతాడు. 


ఇక చివరిగా పవిత్రమైన, ప్రతి హిందువు ఇంట్లో పూజ నిమిత్తం తప్పకుండా పెంచే తులసి మొక్క. తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో.. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసముంటుందని అంటారు. కానీ తులసి మొక్కను పొరపాటున కూడా..దక్షిణాన ఉంచకూడదు. ఆదివారం, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తులసి మొక్కను ముట్టకూడదు, నీళ్లు పోయకూడదు. లేకపోతే ఇబ్బందులు తప్పవు. 


Also read: Astrology tips: ఏ పూవులు ఏ రోజు వాడాలి, అంతులేని సంపద, అదృష్టానికి మార్గాలు ఈ పూవులే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook