Maha Lakshmi Rajyog 2023: హనుమాన్ జయంతి రోజే `శక్తివంతమైన రాజయోగం`.. ఈ 4 రాశులపై కనక వర్షం పక్కా!
Maha Lakshmi Rajyog 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఇవాళ మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా నాలుగు రాశులవారి ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Maha Lakshmi Rajyog will form on Hanuman Jayanti 2023: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాజయోగం ఏర్పడటం అనేది జాతకంలో గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు గ్రహాల యొక్క అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. దీనినే మహాలక్ష్మీ రాజయోగంగా పిలుస్తారు. ఇది ప్రతి వ్యక్తికి అదృష్టం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు అద్భుత ఫలితాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మహాలక్ష్మీ రాజయోగం ఈ రాశులకు వరం
వృషభం
మహాలక్ష్మీ రాజయోగం వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. మీ రాశి యెుక్క లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతోపాటు శష్, మాలవ్య, లక్ష్మీ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ఫలితంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహకారం పొందుతారు.
కన్య
కఈ రాజయోగం కన్యారాశి వారికి చాలా మేలు చేయబోతోంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. సినిమా, సంగీతం, హోటల్ లేదా మద్యం పరిశ్రమలలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈ యోగం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారులు పెద్ద డీల్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. వివాహం కాని వారికి పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ధనలాభం పొందుతారు. మీరు కెరీర్ లో ముందుకు వెళతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి లక్ష్మీ యోగం చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో మీ జాతకంలో మాళవ్య మరియు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీరు అదృష్టం, ఆర్థిక లాభాలు, వ్యాపార లాభాలు మరియు ఉన్నత విద్య పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు.
Also Read: Jupiter transit 2023: పుష్కర కాలం తర్వాత గురు సంచారం.. ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి