Jupiter Transit 2023: పుష్కర కాలం తర్వాత గురు సంచారం.. ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం!

Guru Gochar 2023: ఏ వ్యక్తి యొక్క జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 8, 2023, 05:16 PM IST
Jupiter Transit 2023: పుష్కర కాలం తర్వాత గురు సంచారం.. ఈ 5 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం!

Guru will Gochar in mesh Rashi on 22nd April 2023: 12 సంవత్సరాల తరువాత బృహస్పతి మేషరాశిలో సంచరించబోతున్నాడు. ఈ సంచార ఫలితంగా ఎదురుగా రాజయోగం ఏర్పడబోతోంది. బృహస్పతి తన సొంత రాశి అయిన మీనరాశిని విడిచిపెట్టి.. ఏప్రిల్ 22, 2023న మధ్యాహ్నం 3:33 గంటలకు మేషరాశిలో ఎంటర్ అవ్వతాడు. గురుడు దాదాపు నెల రోజులపాటు మేషరాశిలో ఉంటాడు. ఏ వ్యక్తి జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. ఈ ట్రాన్సిట్ కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందుతారు. 

మిధునరాశి
మేషరాశిలో బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మిథున రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ దక్కుతుంది.  

కర్కాటకం
వ్యతిరేక రాజయోగ ప్రభావం కారణంగా కర్కాటక రాశి వారు అపారమైన సంపదను పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read: Surya Gochar 2023: మేష సంక్రాంతి నుండి ఈ 5 రాశులకు కష్టాలు.. ఇందులో మీ రాశి ఉందా? 

కన్య
మేషరాశిలో బృహస్పతి యొక్క సంచారం కన్యారాశి వారికి మేలు చేస్తుంది. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. అనుకున్నీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

తులారాశి
తుల రాశి వారికి ఈ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు అన్నీ పనులను సజావుగా పూర్తిచేస్తారు. మీరు కొత్త వనరుల నుండి ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

మీనరాశి
బృహస్పతి సంచారం మేషం యొక్క రెండవ ఇంటిలో జరుగుతోంది. వ్యతిరేక రాజయోగ ప్రభావం కారణంగా, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు. ఆఫీసులో మీకు గౌరవం లభిస్తుంది. 

Also Read: Ravanasura Twitter Review : రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News