Pradosh Vrat 2023: ప్రదోష వ్రత శుభ సమయం, వ్రత పూజా విధానం!
Pradosh Vrat 2023: ప్రదోష వ్రతాన్ని ఈ రోజు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రత సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
Pradosh Vrat 2023: సనాతన ధర్మంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల వైశాఖ శుక్ల పక్షంలోని త్రయోదశి తిథిలో ప్రదోష ఉపవాసం ఆచరిస్తారు. ఈ నెలలో బుధవారం (ఈ రోజు) త్రయోదశి తిథి కావడం వల్ల ప్రదోష ఉపవాసం పాటించడానికి సరైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఈ రోజు ప్రదోష వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు శివ పార్వతులకు పూజా కార్యక్రమాలు చేస్తే మంచి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ప్రదోష వ్రతాన్ని ఎలాంటి నియమాలతో ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రదోష వ్రతం చేసే క్రమంలో తప్పకుండా కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన పద్ధతి ప్రకారమే పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలాంటి నియమాలతో ఈ పూజా కార్యక్రమాన్ని ఆచరించాలో తెలుసుకోండి.
ప్రదోష వ్రత శుభ సమయం:
పంచాంగం ప్రకారం.. వైశాఖ శుక్ల పక్షం త్రయోదశి తిథి మే 02 రాత్రి 11:17 గంటలకు ప్రారంభమై.. మే 3 రాత్రి 11:49 గంటలకు మూహూర్తం ముగుస్తుంది. పూజా సమయం సాయంత్రం 6:57 నుంచి రాత్రి 9:06 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడుతుంది. ర్వార్థ సిద్ధి యోగం ఉదయం 5:29 నుంచి 8:56 వరకు, రవియోగం రాత్రి 8:56 నుండి ప్రారంభమై ఆ తర్వాత రోజు ఉదయం 5:38 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
ప్రదోష వ్రత పూజా విధానం:
ప్రదోష వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత తల స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత అక్కడే ఉన్న లక్ష్మి గణపతికి పువ్వులు, నైవేద్యం సమర్పించి పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శివుడు, పార్వతిని పూజించే క్రమంలో తప్పకుండా భక్త శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook