Pradosh Vrat katha in Telugu:  రవి ప్రదోష వ్రతం ఇవాళే అంటే జూన్ 12 (ఆదివారం) నాడు వచ్చింది. ఇది జ్యేష్ఠ మాసంలోని రెండవ ప్రదోష వ్రతం. ఈ వ్రతాన్ని  (Pradosh Vratam) ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యమే కాకుండా ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, కీర్తి, సంపదలు వెల్లివిరుస్తాయి. ఈ ఉపవాసం శివునికి (Lord Shiva) అంకితం చేయబడింది. ఈ వ్రతాన్ని ప్రదోష ముహూర్తంలో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుడు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇక్కడ రవి ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకోవడం ముఖ్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రవి ప్రదోష ఉపవాస కథ
పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. కుటుంబం చాలా పేదది. బ్రాహ్మణుని భార్య నియమానుసారంగా ప్రదోష వ్రతాన్ని (Pradosh Vrat katha) ఆచరించేది. ఒకరోజు అతని కొడుకు గంగాస్నానానికి తన ఊరి నుండి బయటికి వెళుతుండగా, కొందరు దొంగల చేతికి చిక్కి, మీ నాన్నగారి రహస్య సంపద అంతా మాతో చెబితేనే మేము నిన్ను విడిచిపెడతాము అన్నారు. మేం పేదవాళ్లమని, మా దగ్గర రహస్యంగా డబ్బులేమీ లేవని అతడు వివరించాడు. ఇది విన్న దొంగలు అతడిని వదిలి పారిపోయారు. 


అప్పుడు రాజు సైనికులు కొందరు దొంగలను వెతుక్కుంటూ వచ్చారు. మర్రిచెట్టు కింద ఉన్న ఆ కుర్రవాడిని చూడగానే నలుగురిలో ఒకడు అనుకున్నారు. సైనికులు బ్రాహ్మణ కుమారుడిని పట్టుకుని జైలులో పెట్టారు. ఇక్కడ తల్లి తన కొడుకు కోసం వేచి చూస్తుంది. సూర్యాస్తమయం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి తల్లడిల్లిపోయింది. ఆ రోజు ప్రదోష వ్రతం. తన కొడుకు కోసం శివుడిని  ప్రార్థించింది. ఆమె కోరిక మన్నించిన శివుడు రాజు కలలో కనిపించి... మీరు పట్టుకున్న వ్యక్తి  నిర్దోషి అని.. నువ్వు వదలకపోతే నీ రాజ్యమంతా నాశనం అవుతుందని చెప్పాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన రాజు అతడిని విడిచిపెట్టి క్షమించమని కోరాడు. రాజు తన తప్పును సరిదిద్దుకోవడానికి ఆ బ్రహ్మణ యువకుడి పేరు 5 గ్రామాలకు పెట్టాడు. 


(గమనిక - ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu News దీన్ని ధృవీకరించలేదు)


Also Read; Venus Transit In Taurus 2022: ఈ వ్యక్తులు ధనవంతులు కావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి! 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook