Pranayakalahotsavam in Tirumala on January 18 is an interesting event unknown to many devotees : తిరుమలలో చాలామంది భక్తులకు తెలియని ఆసక్తికరమైన ఘట్టం ప్రణయకలహోత్సవం జరగనుంది. వేంకటేశ్వరస్వామి తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం (Pranayakala Utsavam) జనవరి 18న (January 18) తిరుమలలో (Tirumala) వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటల తర్వాత స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. వరాహస్వామి ఆలయం వద్ద స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఎదురవుతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. తర్వాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేశాక.. ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయి. 


ఈ ప్రణయకలహ మహోత్సవాన్ని (Pranayakala Utsavam) తిరుమలలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ (TTD) ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.


కాగా తాజాగా శ్రీగోదాదేవి పరిణయోత్సవాన్ని తిరుమలలో (Tirumala) ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి మూలవిరాట్‌కు పవిత్ర గోదా మాలలను సమర్పించారు. తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలోని (Temple) ఆండాళ్‌ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి (Srivaru) ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. 


Also Read : అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుక్క పిల్లలు.. వాటి కోసం వెతుకుతున్న తల్లి శునకం బాధ వర్ణనాతీతం!!


గోదాదేవి మాలలు తిరుపతి (Tirupati) నుంచి తిరుమల పెద్ద జియ‌ర్‌స్వామివారి మఠానికి చేరుకున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో (Temple) తాజాగా కాకబలి కార్యక్రమాన్ని నిర్వహించారు.


Also Read : Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook