Dog Loses 7 Puppies: అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుక్క పిల్లలు.. వాటి కోసం వెతుకుతున్న తల్లి శునకం బాధ వర్ణనాతీతం!!

తన పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో వాటి కోసం తల్లి కుక్క కోల్‌కతాలోని సింథి పరిసర రోడ్లపై తిరుగుతూ ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 04:50 PM IST
  • అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుక్క పిల్లలు
  • మంటల్లో సజీవ దహనమమైన కుక్క పిల్లలు
  • పిల్లల కోసం వెతుకుతున్న తల్లి కుక్క
Dog Loses 7 Puppies: అగ్ని ప్రమాదంలో చనిపోయిన కుక్క పిల్లలు.. వాటి కోసం వెతుకుతున్న తల్లి శునకం బాధ వర్ణనాతీతం!!

Mother Dog Loses 7 Puppies in Massive Fire accident: ఈ భూ ప్రపంచంలో మాతృత్వానికి మించినది ఏదీ లేదు. మనుషుల వలే జంతువులు కూడా తమ పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటాయి. ఏ చిన్న ఆపద వచ్చినా విలవిలలాడిపోతాయి. ఇక తమ పిల్లలు కనపడకుండా పొతే ఆ భాధ వర్ణనాతీతం. అలాంటి బాదే ఓ శునకం (Dog) ప్రస్తుతం అనుభవిస్తుంది. తన పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోవడంతో వాటి కోసం తల్లి కుక్క (Mother Dog) రోడ్లపై తిరుగుతూ ఉంది. ఈ ఘటన కోల్‌కతా (Kolkata)లోని సింథి పరిసరాల్లో చోటుచేసుకుంది. 

అశోక్ చంద్ర అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సీతి రామ్‌లీలా గార్డెన్‌కు సమీపంలో నివాసం ఉంటున్నాడు. అశోక్ చంద్రకు రెండు రూముల ఇళ్లు ఉంది. కుటుంబ సభ్యులు అందరూ ఒక రూములో నిద్రిస్తుండగా.. మరో గదిలో ఓ కుక్క తన పిల్లలతో (7 Puppies) కలిసి ఉంది. అందరూ నిద్రిస్తుండగా సోమవారం ఉదయం మంటలు చెలరేగి (Fire Broke) ఇల్లు ధ్వంసమయింది. అదృష్టవశాత్తూ అశోక్ చంద్ర ఫామిలీ మెంబెర్స్ అందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే తల్లి కుక్క బయటపడినా.. పిల్లలన్నీ మంటల్లో సజీవ దహనమయ్యాయి. 

Also Read: Amullu Arjun: ఇక తన పేరు 'అముల్లు అర్జున్' అంటున్న అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

2-3 రోజుల క్రితమే పిల్లలు పుట్టడంతో వాటి కోసం తల్లి కుక్క వెతకడం ప్రారంభించింది. మంటల్లో కాలిపోయిన ఇంట్లో పిల్లల కోసం తీవ్రంగా గాలించింది. అక్కడ పిల్లలు కనిపించకుండా పోవడంతో రోడ్డుపై తిరుగుతూ వెతుకుతోంది. ఇది చూసిన చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అయింది. విషయం తెలుసుకున్న వారు కుక్క పట్ల జాలి చూపిస్తున్నారు. రెండు రోజుల క్రితమే శునకం ఏడు పిల్లలకు జన్మనిచ్చిందని స్థానికులు తెలిపారు. 

Also Read: Manjrekar - Kohli: కెప్టెన్సీ ముప్పును గ్రహించి.. కోహ్లీ ముందే తప్పుకున్నాడు! సంచలన వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ క్రికెటర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News