Pushya Nakshatra 2022 : పుష్యమి నక్షత్ర ప్రభావంతో నేడు అంటే.. అక్టోబర్ 18న కొనుగోలు చేసినా, పెట్టుబడి పెట్టినా అధిక లాభాలు వస్తాయి. పుష్య నక్షత్రంతో 5 శుభ యోగాలు ఉండటంతో.. నేడు చేసే కొనుగోళ్లు, పెట్టుబడులపై అపారమైన ధనసంపద చేకూరుతుందని తెలుస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంవత్సరం ధంతేరాజ్ దీపావళికి ముందు అంటే అక్టోబర్ 18 పెట్టుబడికి సంబంధించిన అత్యంత శుభదినం. ఈరోజు 5 శుభ పరిణామాలు ఏర్పడనున్నాయి. వీటి కారణంగా గ్రహాలు, రాశుల కలయిక వల్ల శుభకార్యాలు చేసినా, పెట్టుబడులు పెట్టినా వాటికి వరంలా ఉంటుంది. 200 ఏళ్ల తర్వాత ఇలాంటి శుభపరిణామం మళ్లీ జరిగింది. 


పుష్యమి నక్షత్ర ప్రభావం ఈరోజంతా.. 
సూర్యోదయంతో ఈరోజు అక్టోబర్ 18న పుష్య నక్షత్రం ప్రారంభమైంది. ఇది రోజంతా ఉంటుంఇ. అంతే కాకుండా రేపటి ఉదయం వరకు కూడా ప్రభావం ఉంటుంది. అక్టోబర్ 18వ తేదీ మొత్తం అంటే అర్థరాత్రి వరకు షాపింగ్ చేయొచ్చు. పెట్టుబడులు పెట్టొచ్చు. 


పుష్యమి నక్షత్రం అక్టోబర్ 19 ఉదయం 8:02 గంటలకు ముగుస్తుంది. అదే సమయంలో, ఈ రోజు సాయంత్రం 4:53 గంటలకు సిద్ధ యోగం కూడా ఉంటుంది. ఇది కాకుండా, హన్స్, భద్ర మరియు శంఖ్ అనే రాజయోగం కూడా ఉంటుంది. ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుంది.


ఇవి చేస్తే మేలు..
ఈ ముహూర్తంలో శుభ కార్యాలు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లేదా డబ్బు పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ ముహూర్తంలో కొన్న వస్తువులు ఎక్కువ కాలం ఉండటమే కాకుండా.. మనకు శుభఫలితాలు ఇస్తాయట. ఈరోజు వాహనాలు, గృహాలు, దుకాణాలు, బట్టలు, బంగారం, వెండి, పాత్రలు, భూమి కొనుగోలు లేదా విక్రయించడం చేస్తే ఎంతో శుభం కలుగుతుందట. అంతే కాకుండా ఈ సమయం లావాదేవీలు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా అనుకూలమైనదని శాస్త్రం చెబుతోంది.


పంచాంగం ప్రకారం షాపింగ్ చేయడానికి అనుకూలమైన సమయం


శుభ ముహూర్తం: ఉదయం 10.41 నుంచి 12.06 వరకు, రాత్రి 7.23 నుంచి 8.57 వరకు


అమృత ఘడియలు: మధ్యాహ్నం 12.07 నుంచి 1.31 వరకు


అత్యంత శుభ సమయం : మధ్యాహ్నం 2.57 నుంచి 4.23 వరకు, మధ్యాహ్నం 10.32 నుంచి 12.06 వరకు


Also Read : Anasuya Bharadwaj : ఫ్లైట్‌లో డ్రెస్ చిరిగిందట.. విమానాయాన సంస్థపై అనసూయ ఫైర్


Also Read : Karthika Deepam Set : సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 


(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)