Pushya Nakshatra 2022 : చాలామంది జాతకం, ముహూర్తం చూడనిదే ఏ పని మొదలుపెట్టరు. ఏ శుభకార్యానికైనా, విలువైన వస్తువుల కొనుగోలుకైనా శుభ ముహూర్తం చూసుకుంటారు. శుభ ముహూర్తాలు లేని పక్షంలో కొన్నాళ్లు ఆ పనులు వాయిదా వేసుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో ఎలాంటి శుభ ముహూర్తాలు అవసరం లేదు. ఆరోజులో చేపట్టే అన్ని పనులు సత్ఫలితాలనిస్తాయి. అందులో పుష్య నక్షత్రం ఒకటి.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ (జూన్ 4) పుష్య నక్షత్రం. జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్ష ఐదవ రోజు ఈ పుష్య నక్షత్రం ఏర్పడుతుంది. ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్య నక్షత్రం ప్రత్యేకత :


పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, అధిదేవత బృహస్పతి. తమ జాతకంలో ఈ నక్షత్రాన్ని కలిగినవారు చిన్నతనం నుంచి యవ్వనం వరకు అనేక కష్టనష్టాలను చవిచూస్తారు. అన్నింటికీ ఎదురొడ్డి నిలిచి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుతారు. పుష్యమి నక్షత్రానికి జంతువుల్లో మేకను, పక్షుల్లో నీరుకాకిని సంకేతంగా చెబుతారు.పుష్య నక్షత్రం ఏర్పడే రోజున ఆ నక్షత్ర జాతకులకు శుభయోగం కలుగుతుంది.


పుష్య నక్షత్రం ఏ సమయంలో.. :


హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య నక్షత్రం జూన్ 3, 2022న శుక్రవారం రాత్రి 7.05 గంటల నుంచి జూన్ 4, 2022 శనివారం రాత్రి 11.55 గంటల వరకు ఉంటుంది.


పుష్య నక్షత్రంలో ఏం చేస్తే మంచిది :


పుష్య నక్షత్రం భూమి, వాహనం, బంగారం, ఇల్లు వంటి ఖరీదైన వస్తువుల కొనుగోలుకు చాలా శుభప్రదమైనది. కాబట్టి చాలామంది పుష్య నక్షత్రం కోసం ఎదురుచూసి మరీ వీటిని కొనుగోలు చేస్తారు. పుష్య నక్షత్రం రోజు చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరుతుంది. ఒకరకంగా అన్ని రాశులకు పుష్య నక్షత్రం రాజుగా పరిగణించబడుతుంది. కాబట్టి పుష్య నక్షత్రం ఏర్పడే రోజు శుభయోగమే తప్ప అశుభమనే మాటే ఉండదు. ఒకరకంగా పట్టిందల్లా బంగారమే.


ఇలా చేస్తే అంతా శుభమే :


పుష్య నక్షత్ర సమయంలో దక్షిణావర్తి శంఖాన్ని మీరు నిర్వహించే షాపులో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆర్థికంగా కలిసొస్తుంది.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్య నక్షత్ర సమయంలో చతురస్రాకారపు వెండి ముక్కను కొనుగోలు చేసి.. శని దేవుడిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.


ఈరోజున విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని పూజించడం, శ్రీయంత్రాన్ని కొనుగోలు చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది.


పుష్య నక్షత్రం రోజున వ్యాపార కార్యకలాపాలు లాభదాయకంగా ఉంటాయి.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Rajya Sabha Elections: పోటీలేక ఏకగ్రీవమైన 41 రాజ్యసభ స్థానాలెంటో మీకు తెలుసా..!


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook