Ayodhya Rama: అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని స్వాగతం కోసం వేయి కళ్ళతో ప్రజల ఎదురు చూస్తున్నారు. ఈ సుమధుర ఘట్టాన్ని కల్లారా చూడాలి అని తపించే ప్రతి ఒక్కరి కోసం సరికొత్త ఏర్పాటు చేయబడింది. దేశవ్యాప్తంగా ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని వీక్షించే విధంగా 160 కి పైగా స్క్రీన్ లలో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. థియేటర్ అనగానే కాలపరిమితి ఉంటుంది అనుకుంటారేమో.. ఇక్కడ టైం లిమిట్ అస్సలు లేదు కార్యక్రమం జరిగినంత సేపు చూస్తూ ఉండవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధర ను కూడా కేవలం 100 రూపాయలకు నిర్ణయించారు. వంద రూపాయల అనుకుంటారేమో మరో ట్విస్ట్ కూడా ఉంది.. థియేటర్ కు వెళ్లిన వాళ్లకు పాప్ కార్న్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. మీ టిక్కెట్ రేటు బాగా గిట్టుబాటు అవడానికి ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ ఏముంటుంది చెప్పండి. ఈ అద్భుతమైన స్కీమును మీ ముందుకు ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్ తక్..పివిఆర్ తీసుకువచ్చారు.


ఇంట్లో కూర్చొని లైవ్ టెలికాస్ట్ చూడకుండా థియేటర్ కు వెళ్లి మరి చూడాల్సిన అవసరం ఏమిటి? అని మీలో చాలామంది అనుకుంటారు కదా.. ఇంట్లో అందరికీ పెద్ద స్క్రీన్లు ఉండవు. పైగా ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా చూడాలి అంటే కుదరని పరిస్థితి కొందరిది. అందుకే అందరికీ రాముని స్వయంగా చూసిన అనుభూతి కలిగే విధంగా థియేటర్లలో ఈ సుమధుర ఘట్టాన్ని ప్రసారం చేస్తున్నారు. పెద్ద తెరపై రాముడు దర్శనం భక్తులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలి అన్న ఈ చిన్ని ప్రయత్నానికి ఎందరో మద్దతుగా నిలుస్తున్నారు.


ఒక్కప్పుడు క్రికెట్ మ్యాచ్ లను ఈ రకంగా ప్రసారం చేసే వాళ్ళు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఆలయాల ఓపెనింగ్స్ కూడా మొదలైపోయింది . కేంద్ర ప్రభుత్వం కనివిని ఎరుగని వీధిలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 22వ తారీఖున శ్రీ రామ చంద్రుని ఆగమనాన్ని వీక్షించడం కోసం జనాలు థియేటర్లలో టికెట్లు బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు.


Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ


Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter