Rahu-Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువులు గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. వీటిని కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే రాహు-కేతువులు అక్టోబర్ 30న రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం మొత్తం ఒకటిన్నర సంవత్సరాల పాటు ఉంటుంది. రాహు-కేతు సంచార ప్రభావం వల్ల 2025 వరకు కొన్ని రాశుల వారికి లాభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి:
రాహు-కేతు సంచార ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపున్నారు. వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి మీకు సపోర్ట్‌గా నిలుస్తుంది. దీని కారణంగా జీవితంలో మరిన్ని లాభాలు పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశివారు కొత్త భూములు, భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.


మిథున రాశి:
ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా మిథున రాశి వారికి  ఒకటిన్నర సంవత్సరాలు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్ధతు లభించి ఊహించని లాభాలు పొందుతారు. ఈ సమయంలో కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దీంతో పాటు ధన ప్రవాహం పెరుగుతుంది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి రాహు-కేతు సంచారం శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా  మీ భాగస్వామి, పిల్లల నుంచి కూడా మద్దతు పొందుతారు. దీంతో పాటు ఊహించని లాభాలు కూడా పొందుతారు. 


మకర రాశి:
రాహు-కేతు సంచారం మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార ప్రభావం వల్ల జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు. మీ పిల్లల నుంచి పూర్తి మద్దతు లభించి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook