Rahu Ketu Gochar 2023: రాహు-కేతు గ్రహల సంచారం వల్ల ఈ రాశులవారికి 3 నెలల పాటు నష్టాలు తప్పవా..?
Rahu Ketu Gochar 2023: రాహు కేతు గ్రహ సంచారాల వల్ల పలు రాశుల వారి జీవితాల్లో ఊహించని పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రాశుల వారి జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కింద పేర్కొన్న పరిహారాలను పాటించడం చాలా మంచిది.
Rahu Ketu Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు గ్రహాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకవేళ మనిషిపై రాహు కేతువుల చెడు ప్రభావం పడితే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం రాహు కేతు గ్రహాలు రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి. ఈ రాహు కేతు సంచారం చేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల సమయం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీన రాశిలోకి ఈ సంవత్సరం అక్టోబర్ 30న రాహు కేతు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. నాలుగు రాశుల వారి జీవితాల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయి. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ఆర్థిక సంక్షోభం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు నివారణ చర్యలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
ఈ గ్రహాలపై రాహు కేతు తీవ్ర ప్రభావం:
కన్య రాశి :
రాహు కేతు చెడు ప్రభావం కన్యా రాశిపై తీవ్రంగా పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలతో కూడా సతమతమవుతారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన ఆర్థిక నష్టాలు కలుగుతాయి కాబట్టి.. తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మీనరాశి:
ఈ మీన రాశి వారికి కూడా రాహు కేతువు సంచారం తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఆర్థికంగా భారీగా నష్టపోతారు. అంతేకాకుండా నష్టాలు పెరిగి ఉద్యోగంలో తీవ్ర సమస్యలకు లోనవుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇతర వ్యక్తుల ద్వారా డబ్బులను అప్పుగా తీసుకుంటారు. కాబట్టి ఈ క్రమంలో ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా రాహు కేతు గ్రహ సంచారం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. ఈ క్రమంలో ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి.. తప్పకుండా ఆర్థిక విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కుటుంబంలో పలు సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది..కాబట్టి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి.
మేషరాశి:
మేష రాశి వారికి జీవిత భాగస్వామితో ఈ క్రమంలో విభేదాలు తలెత్తవచ్చు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం కారణంగా వీరికి ఒత్తిడి పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆర్థిక విషయాలపై వీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
నివారణ చర్యలు:
ఈ రాహు కేతు రాశి సంచార క్రమంలో మీరు మాట్లాడే విషయాల పై తప్పకుండా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనవసరంగా ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదు. ఖర్చులను తగ్గించుకొని ఆదాయం పెంచుకునే మార్గాలను వెతుక్కోవడం చాలా మంచిది. సెలవు దినాలలో కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటే ఓదార్చడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో ఆర్థిక విషయాలపై తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook