These 4 signs peoples will face more difficulties in 2023 due to Rahu Ketu Transit: వేద జ్యోతిషశాస్త్రంలో శని క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా రాహు-కేతువులను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. రాహు-కేతు గ్రహాలు ఎల్లప్పుడూ తిరోగమనం వైపు పయనిస్తాయి. అందుకే ఓ వ్యక్తి జాతకంలో రాహు-కేతు స్థానం అశుభంగా ఉంటే.. అతడు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. రాహు-కేతువులు ఒకటిన్నర సంవత్సరం తర్వాత తమ రాశిని మారుస్తాయి. 2023లో రాహు, కేతు గ్రహాలు రెండూ సంచరించబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022లో రాహు-కేతువులు తమ రాశిని మార్చుకున్నాయి. 2023లో కూడా ఈ రెండు గ్రహాలు సంచరిస్తాయి. అయితే 2024 సంవత్సరంలో రాహు-కేతు సంచారాలు మాత్రం జరగవు. కాబట్టి జ్యోతిష్య పరంగా 2023 సంవత్సరం చాలా ముఖ్యమైనది. రాహు-కేతు సంచారము 2023 అక్టోబర్ 30న జరుగుతుంది. రాహు-కేతువుల సంచారం ఏ రాశులకు ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషం, వృషభం, కన్య, మీన రాశుల వారికి అక్టోబర్ 30 తర్వాత కష్టాలు తప్పవు. 


మేష రాశి :
2023 సంవత్సరంలో రాహు-కేతువుల సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉండదు. రాహు-కేతువులు ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం కూడా బాగుండదు. భాగస్వాముల మధ్య వైరం ఏర్పడవచ్చు. నిత్యం సమస్యలు ఉంటాయి. 


వృషభ రాశి:
రాహు-కేతువుల సంచారం వృషభ రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. పెరిగే ఖర్చులు మీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కాబట్టి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. 


కన్యా రాశి:
2023 సంవత్సరంలో కన్యా రాశిలో కేతువు ఉంటాడు. దీంతో కన్యా రాశి జీవితంలో నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో మీ సంబంధాలు పాడవుతాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


మీన రాశి:
2023లో మీన రాశిలోకి రాహువు ప్రవేశిస్తాడు. రాహు సంచారం వ్యాపార పరంగా అస్సలు మంచిది కాదు. ఖర్చులు పెరుగుతాయి. రుణం తిరిగి చెల్లించడంలో సమస్యలు ఏర్పడుతాయి. ఏకాగ్రత లోపిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బంధువులు, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.


Also Read: Mohammed Siraj: మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి!  


Also Read: Basara Online Aksharabhyasam Tickets: బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసం.. టికెట్‌ ధరలు ఇవే! విదేశీయులకు ఎక్కువే  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.