Basara Online Aksharabhyasam Tickets: బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసం.. టికెట్‌ ధరలు ఇవే! విదేశీయులకు ఎక్కువే

Basara Online Aksharabhyasam Tickets Prices out. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను దేవాదాయ శాఖ తాజాగా నిర్ణయించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 8, 2022, 08:59 AM IST
  • బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసం
  • టికెట్‌ ధరలు ఇవే
  • విదేశీయులకు ఎక్కువే
Basara Online Aksharabhyasam Tickets: బాసరలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసం.. టికెట్‌ ధరలు ఇవే! విదేశీయులకు ఎక్కువే

Basara Online Aksharabhyasam Tickets Prices out: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం 'బాసర' అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం. చిన్నారులకు బాసరలోని శ్రీసరస్వతీ అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించడం ద్వారా చదువుపై ఆసక్తి ఉంటుందని, గొప్పగా చదవుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారని భక్తులు నమ్ముతుంటారు. అందుకే దేశం నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది తల్లిదండ్రులు బాసర ఆలయానికి తరలివస్తారు. ప్రతి సంవత్సరం దాదాపుగా 80,000 నుంచి 1,00,000 మంది బాసర ఆలయం ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేస్తారు. 

భక్తుల రద్దీ దృష్ట్యా అక్షరాభ్యాసంను ఆన్‌లైన్‌లో తీసుకురావాలని దేవాదాయ శాఖ ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించారు. భారత దేశంలోని వారితో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. వారికి పూజ చేసిన వస్తువులను తపాలా శాఖ (Post) ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. విదేశీయులకు ఆన్‌లైన్‌ టికెట్‌ ధర రూ. 2516 ఉండగా.. స్వదేశంలో ఉన్నవారికి రూ.1516గా ఉన్నాయట. 

బాసరలోని సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న  దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈఓ విజయరామారావు చర్చించారు. 

Also Read: Rohit Sharma: రోహిత్‌ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో

Also Read: CM KCR: కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు.. 5-10 రోజుల్లో రైతుబంధు డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Trending News