December Raj Yoga 2022: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక వల్ల అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. అత్యంత పవిత్రమైన యోగాలలో రాజయోగం కూడా ఒకటి. ఈ యోగం డిసెంబరు నెలలో ఏర్పడుతుంది. నవంబరు 13న అంగారకుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా రాజయోగం ఏర్పడుతుంది. ఇది డిసెంబరు 5 వరకు ఉంటుంది. మరోవైపు డిసెంబరు 5న శుక్రుడు తన స్థానాన్ని మార్చుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కుజుడు మరియు శుక్రుడు కలయిక వల్ల అరుదైన రాజయోగం (Raj Yoga 2022) ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనస్సు (Sagittarius): కుజుడు మరియు శుక్రుడు కలయిక వల్ల ఏర్పడిన రాజయోగం ఈ రాశివారికి ప్రయోజనకరంగా ఉండనుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. దీంతోపాటు జీతం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది.  


వృషభం (Taurus): ఈ రాశి వారికి అంగారకుడు మరియు శుక్ర గ్రహాల మద్దతు లభిస్తుంది. దీంతో ఆగిపోయిన మీ పనులు పూర్తి కాగలవు. మీ జీవితంలో సౌకర్యాలు మెరుగువుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మెుత్తానికి ఈ టైం మీకు సూపర్ గా ఉంటుంది. 


కర్కాటకం (Cancer): ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీరు జీవితంలో సంతోషాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 


మిథునం (Gemini): ఈ రాశి వారికి శుక్రుని మద్దతు లభిస్తుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. విదేశాలకు సంబంధించిన బిజినెస్ లో రాణిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయంలో రెట్టింపు లాభం ఉంటుంది.


Also Read: Shani Dev: ఈ 3 రాశులు శని దేవునికి చాలా ఇష్టం.. కాబట్టి ఈ రాశువారికీ ఆ నెల దాకా ధన ప్రవాహమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook