Rakhi Pournami 2024: 90 సంవత్సరాల తర్వాత రాఖీ రోజు 5 యోగాలు.. రాఖీ ఈ సమయాల్లో కడితే అంత శుభమే..
Rakhi Pournami 2024: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఈ పండగ రోజున అక్క తమ తమ్ముడి పై ఉన్న ప్రేమను కురిపిస్తూ మణికట్టుకు ప్రేమతో రాఖీని కడుతుంది. అయితే ఈ రాఖీ పండగ రోజున ఎన్నో శుభ యాదృచ్ఛికాలు జరుగుతాయి. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.
Rakhi Pournami 2024: అక్క తమ్ముడి మధ్య ఉన్న అపారమైన ప్రేమకు చిహ్నంగా ప్రతి సంవత్సరం రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఏడాది శ్రావణమాసంలో వచ్చే మొదటి పౌర్ణమి రోజున జరుపుకోవడం ఆనవాయితీ వ్యవస్తోంది. పండగ రోజున సోదరీమణులంతా కలిసి తమ సోదరుడికి రాఖీ కట్టి అపారమైన ప్రేమను చాటుకుంటారు. ఈ పండగకు భారత దేశ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఈ రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
అయితే ఈ సంవత్సరం వచ్చి రాఖీ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉండబోతోంది. ఎందుకంటే ఈ రక్షాబంధన్ పండగ రోజున జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని యాదృచ్ఛికాలు జరగబోతున్నాయి. దీంతో ఈ పండగకు మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున పండగ వచ్చింది. దీంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయం పూట కాస్త చెడు సమయం కావడంతో సోదరీమణులు తమ సోదరులకు ఉదయం పూట రక్షా సూత్రాన్ని కట్టలేరట.
శక్తివంతమైన ఐదు యోగాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 19వ తేదీ సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన శోభనయోగం, రవియోగం, సర్వార్ధ సిద్ధ యోగం తో పాటు సౌభాగ్య సిద్ధయోగం ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా వీటి కలయిక శ్రవణా నక్షత్రంలో జరుగుతుంది. దీంతో ఇలా ఏర్పడడం చాలా అరుదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. పంచాంగం ప్రకారం ఈ పౌర్ణమి రోజున భద్రనీడ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. దీనికి కారణంగా 19వ తేదీ రోజున తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టేవారు 12లోపే కట్టాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రనీడలో శుభకార్యాలు నిర్వహించడం అంత మంచిది కాదట. కాబట్టి ఈరోజు ఈ నీడ దాదాపు మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టకపోవడం ఎంతో మంచిది. దీంతోపాటు కొంచెం లేటుగా రాఖీ కట్టాలనుకునేవారు భద్రనీడ సమయం గడిచిన తర్వాత కట్టినప్పటికీ కూడా ఫలితాలు పొందుతారు. శనికి సోదరీ అయినా భద్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం అంత మంచిది కాదు.. కాబట్టి భద్రకాలం గడిచిన తర్వాతే రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
రాఖీ కట్టడానికి శుభ సమయాలు..
సర్వార్థ సిద్ది యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోదయం నుంచి దాదాపు ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. ఇక రవి యోగం విషయానికొస్తే.. ఈ యోగం కూడా ముందు యోగం సమయం లాగే ఉండబోతోంది. ఇక శుభ సమయం విషయానికొస్తే.. భద్ర కాలం ముగిసిన తర్వాత అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమై ఎనిమిది గంటల వరకు ముగుస్తుంది. కాబట్టి ఈ సమయాల్లో ఎప్పుడు రాఖీ కట్టిన అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.