Raksha Bandhan 2023: హిందూ సాంప్రదాయంలో రాఖీ పండగగకు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులు తమ బంధాన్ని మరింత పెంచుకునేందుకు సోదరలకు రాఖీలను కడతారు. ఈ రాఖీ రక్షాసూత్రమే కాకుండా ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ రాఖీ పండగ సందర్భంగా సోదరీమణులు ముందు నుంచే రంగు రంగుల రాఖీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..అక్క చెల్లెల్లు తమ సోదరలు పుట్టిన నెలను బట్టి కలర్‌ కలర్‌ రాఖీలను కట్టాల్సి ఉంటుంది. నిపుణులు తెలిపిన కొన్ని రంగుల రాఖీలు సోదరుడికి కట్టడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుది. అంతేకాకుండా ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోల్డెన్ ఎల్లో రాఖీ:
ఆగస్టులో పుట్టిన సోదరులకు గోల్డెన్ ఎల్లో రాఖీలను కట్టడం వల్ల ప్రేమ మరింత పెరుగుతుంది. దీంతో పాటు జీవితంలో శక్తి కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోదరులకు బుద్ధితో పాటు మనోబలం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటారు. 


నారింజ రంగు రాఖీ:
ఆగస్టులో జన్మించిన సోదరులకు నారింజ రంగు రాఖీని కూడా కట్టవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రంగు జీవితంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆరెంజ్ రాఖీ సోదరుడికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాఖీ కట్టడం వల్ల మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది.


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్


ఎరుపు రంగు రాఖీ:
సోదరులకు ఎరుపు రంగు రాఖీలు కట్టడం కూడా చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు  బలం, అంకితభావం కూడా పెరుగుతుంది. ఎరుపు రంగు రాఖీ అన్నదమ్ముల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఆర్థికత వైపు దృష్టి మళ్లుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 


గోల్డెన్ కలర్ రాఖీ:
గోల్డెన్ కలర్ రాఖీ కూడా సోదరలుకు కట్టొచ్చు. ఈ కలర్‌ రాఖీని విజయం, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. అయితే రాఖీ రోజున సోదరీమణులు గోల్డెన్ కలర్ రాఖీని కట్టడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. 


ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి