Rakhi Pournami 2022: రాఖీ పండుగ ఎప్పుడు? రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం తెలుసుకోండి
Raksha Bandhan 2022: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. సోదరీమణులకు సోదరులు జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది.
Raksha Bandhan 2022: ''అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మలా సంబంధం.. జాబిలమ్మకిది జన్మదినం..కోటి తారకల కోలాహలం''…’ అంటూ సోదర సోదరీమణుల బంధం గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు ఓ సినీకవి. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల బంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ. ఇది శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన్ (Raksha Bandhan 2022) జరుపుకుంటారు. ఈ ఏడాది పౌర్ణమి ఆగస్టు 11, 12 తేదీల్లో వస్తుంది. ఈ నేపథ్యంలో పండగను ఏ రోజున జరుపుకోవాలనే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది. రాఖీ పండుగ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి.. స్వీట్ తినిపించి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
శుభ సమయం
శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ ఆగస్టు 11 ఉదయం 10:38 గంటల నుండి ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 07:05 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్యుల ప్రకారం, ఆగస్టు 11 న రక్షాబంధన్ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజున ఉదయం 10:38 నుండి రాత్రి 9 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభసమయం. ఈ సమయంలోనే అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:57 వరకు ఉంటుంది. అదే సమయంలో, అమృత్ కాల్ సాయంత్రం 06:55 నుండి రాత్రి 08:20 వరకు ఉంటుంది.
ఈ ముహూర్తంలో రాఖీ కట్టకండి
సోదరీమణులారా భద్ర ముహూర్తంలో పొరపాటున కూడా రాఖీ కట్టవద్దు. ఎందుకంటే భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే లంకాపతి రావణుడి సోదరి భద్ర ముహూర్తంలో రాఖీ కట్టడం వల్లే రాముడి చేతిలో చంపబడ్డాడు. ఆగస్టు 11వ తేదీన భద్ర ముహూర్తం సాయంత్రం 05:17 నుండి రాత్రి 08:51 వరకు ఉంటుంది.
Also Read: Som Pradosh Vrat 2022 : రేపే సోమ ప్రదోష వ్రతం.. శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook