Som Pradosh Vrat in July 2022: రేపే సోమ ప్రదోష వ్రతం. హిందూమతంలో దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం పాటిస్తారు. ఇది సోమవారం రావడంతో దీనిని సోమ ప్రదోష వ్రతం (Som Pradosh Vrat) అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటూ.. శివుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఇదే రోజున 4 శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి. అవే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, శుక్ల యోగం, బ్రహ్మ యోగం. పంచాంగం ప్రకారం ఈ రోజున అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంటాయి. ఇన్ని ఏర్పడుతున్నాయి కాబట్టి జూలై 11కు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజు శుభకార్యాలకు చాలా మంచిది. సోమ ప్రదోష వ్రతం రోజు శుభ సమయం సాయంత్రం 07.22 గంటల నుండి రాత్రి 09:24 గంటల వరకు ఉంది.
వ్రత పూజా విధానం
ఆస్ట్రాలజీ ప్రకారం, సోమ ప్రదోష వ్రతాన్ని సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు నుండి సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల వరకు పూజిస్తారు. ఈ కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఇందులో శివునికి నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం శివుడికి పూజ చేయడం ప్రారంభించండి. ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన తేనెను తీసుకుని శివలింగానికి అభిషేకించండి. తర్వాత జలాభిషేకం చేయండి. ఆరాధన సమయంలో ఓం నమః శివాయ లేదా సర్వ సిద్ధి ప్రదయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం ప్రదోష వ్రత కథ మరియు శివ చాలీసా పఠించండి. చివరగా పరమేశ్వరుడికి హారతి ఇచ్చి పూజను పూర్తి చేయండి. ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం కూడా ఎంతో మేలు చేస్తుంది.
Also Read: Bakrid 2022: త్యాగానికి ప్రతీక బక్రీద్.. ఈ రోజున మేకలను ఎందుకు బలిస్తారు?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook