Ram mandir flags: రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మీ ఇంటిపై కూడా రాముని జెండా ఎగురవేయాలనుకుంటున్నారా..అయితే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు పాటించాలంటున్నారు వాస్తు పండితులు. ఎలా పడితే అలా జెండా ఎగురవేయకూడదంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు ప్రకారం ప్రతి పని నియమాల ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పని వెనుక సానుకూల లేదా ప్రతికూల పరిణామాలుంటాయి. ఏ పని ఏ దిశలో చేయాలో నిర్దేశనం ఉంటుంది. అదే విధంగా రాముని జెండా ఎగురవేయాలన్నా నియమ నిబంధనలుంటాయి. హిందూమత విశ్వాసాల ప్రకారం జెండా ప్రతిష్టించే సాంప్రదాయముంది. ఏదైనా హిందూ పండుగలు లేదా విశేష కార్యక్రమాలకు ఇంటి కప్పుపై జెండా ఎగురవేస్తుంటారు. అయితే ఈ జెండా ఎగురవేయడం వెనుక చాలా నియమ నిబంధనలున్నాయి. హిందూమతంలో ప్రతి దేవతకు ఓ ప్రత్యేక జెండా ఉంటుంది. అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు రాముని జెండా ఎగురవేస్తున్నారు. అయితే ఈ జెండా ఎలా ఎగురవేయాలనేది తెలుసుకుందాం..


వాస్తు ప్రకారం ఇంటిపై మూడు రంగుల్లో ఏదో ఒక రంగు జెండా ఎగురవేయవచ్చు. కాషాయం, కుంకుమ, పసుపు రంగుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అదే విధంగా జెండా ఎగురవేసేటప్పుడు కూడా కొన్ని విషయాలు పరిగణలో తీసుకోవాలి. ఇంటిపై వాయువ్య దిశలోనే జెండా ఎర్పాటు చేసుకోవాలి. ఈ దిశలో జెండా ఉండటం శుభసూచకం. ఒకవేళ మీ ఇంటి దిశ వేరే దిశలో ఉంటే మీ ఇంటికి తగ్గట్టుగా వాస్తు పండితుని సలహా మేరకు జెండా ప్రతిష్టించాలి.


రామ మందిరం జెండాపై స్వస్తిక్ లేదా ఓం ముద్ర ఉండాలి. కుంకుమ రంగు జెండా అమర్చుకోవచ్చు. ఈ జెండాలు రెండు ఆకారాల్లో ఉంటాయి. ఒకటి త్రిభుజాకారం రెండవది రెండు త్రిభుజాకార జెండాలు. రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అయితే ఈ జెండాపై శ్రీరాముని చిత్రం, ధనస్సు, జై శ్రీరాం చిహ్నం తప్పకుండా ఉండాలి. హనుమంతుడి ఫోటో కూడా ఉండవచ్చు. ఇంటిపై ఈ జెండా ప్రతిష్ఠించడం వల్ల కీర్తి ప్రతిష్ఠలు, విజయం లభిస్తాయంటారు. ఇంట్లో కుటుంబసభ్యులు సైతం వివిధ రకాల రోగాలు, కష్టనష్టాల్నించి విముక్తులౌతారు. 


Also read : Ayodhya Verdict Judges: అయోధ్య తీర్పు ఇచ్చిన 5 మందికి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం, ఆ ఐదుగురు ఇప్పుడేం చేస్తున్నారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook