Ayodhya Verdict Judges: అయోధ్య తీర్పు ఇచ్చిన 5 మందికి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం, ఆ ఐదుగురు ఇప్పుడేం చేస్తున్నారు

Ayodhya Verdict Judges: అయోధ్య రామమందిరం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. హిందూవులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిరం నిర్మాణ కల సాకారమైంది సుప్రీంకోర్టు తీర్పుతోనే. అందుకే ఆ న్యాయమూర్తులు ఇప్పుడు చర్చనీయాంసమౌతున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 20, 2024, 07:43 AM IST
Ayodhya Verdict Judges: అయోధ్య తీర్పు ఇచ్చిన 5 మందికి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం, ఆ ఐదుగురు ఇప్పుడేం చేస్తున్నారు

Ayodhya Verdict Judges: దేశంలో వివాదాస్పద బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సమస్యకు పరిష్కారం సంగతేమో గానీ ఫుల్‌స్టాప్ పడింది. వివాదాస్పద స్థలంపై హక్కుల్ని హిందూవుల పక్షాన కేటాయిస్తూ రామ మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అందుకే ఆ న్యాయమూర్తులు ఐదుగురికీ రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందింది.

అయోధ్యలోని బాబ్రీ వర్సెస్ రామ జన్మభూమి వివాదంపై 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అప్పటి ఛీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సహా ఐదుగురు సభ్యులున్నారు. జనవరి 22న జరుగుతున్న రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఐదుగురిని రాజకీయ అతిధులుగా ఆహ్వానాలు అందాయి. వివాదాస్పద స్థలాన్ని హిందూ పక్షానికి కేటాయిస్తూ రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తీర్పు అది. ఈ ఐదుగురిలో ఇప్పటి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, అప్పటి సీజేఐ రంజన్ గగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బాబ్డే, మాజీ న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. 

నవంబర్ 9వ తేదీ 2029న వెలువడి చారిత్రాత్మక తీర్పులో ఈ ఐదుగురు ఉన్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించిన 50కు పైగా న్యాయరంగ నిపుణుల్లో మాజీ సీజేఐ, ఇతర న్యాయమూర్తులు, అప్పటి రామ జన్మభూమి న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఉన్నారు. రామమందిరంపై తీర్పు ఇచ్చిన ఆ ఐదుగురు న్యాయమూర్తులకు అనంతరం లభించిన పదవుల వివరాలు ఇలా ఉన్నాయి.

జస్టిస్ రంజన్ గగోయ్

అయోధ్య రామమందిరం తీర్పు సమయంలో ఛీఫ్ జస్టిస్ ఈయేనే. తీర్పు ఇచ్చిన వారం రోజులకు అంటే నవంబర్ 17, 2019న రిటైర్ అయ్యారు. ఆ తరువాత 4 నెలల తరువాత రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులయ్యారు. 

జస్టిస్ ఎస్ఏ బోబ్డే

జస్టిస్ రంజన్ గగోయ్ తరువాత ఈయనే 47వ చీఫ్ జస్టిస్. 2021 ఏప్రిల్ 23న రిటైర్ ఆయ్యారు. ఆ తరువాత మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్శిటీ నాగపూర్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. 

జస్టిస్ డీవై చంద్రచూడ్

బోబ్డే తరువాత జస్టిస్ రమణ..ఆ తరువాత ఈయనే ఛీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టుకు దీర్ఘకాలం సీజేఐగా చేసిన జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడు. ఇప్పుడు కూడా ఈయనే సీజేఐగా ఉన్నారు. 

జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్

రామమందిరం తీర్పు ఇచ్చిన ప్యానెల్‌లో ఒకరు. నోట్ల రద్దు సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్‌పై తీర్పు ఇచ్చిన ప్యానెల్‌లో కూడా ఉన్నారు. జనవరి 2023లో రిటైర్ అయిన నెల రోజులకే ఏపీ గవర్నర్‌గా నియమితులయ్యారు. 

జస్టిస్ అశోక్ భూషణ్

రామమందిరంపై తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు. 2021 జూలైలో రిటైర్ అయిన 4 నెలలకు నేషనల్ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా నియమించారు.

Also read: Ayodhya Ram Mandir: అయ్యోధ్య రాముడి చెంతకు మన సిరిసిల్ల బంగారు చీర.. దేశం నలుమూలల నుంచి బహుమతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News