Lucky Zodiac 2023: అరుదైన ధన యోగం... న్యూ ఇయర్ లో ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం ఖాయం..
Budh Shukra Gochar 2023: మరో మూడు రోజుల్లో 2023 వచ్చేస్తోంది. ఈ కొత్త సంవత్సరం నాలుగు రాశులవారిని ధనవంతులు చేయనుంది. ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి.
Budh Shukra Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూఇయర్ లో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. వీటిలో ఫిబ్రవరి నెలలో జరిగే గ్రహ మార్పులు కొందరికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఫిబ్రవరిలో మెర్క్యురీ మరియు శుక్రుల సంచారం కారణంగా అరుదైన రాజయోగం (Dhan Rajyog) ఏర్పడుతుంది. ఈ ధనయోగం 4 రాశులవారిని త్వరలోనే ధనవంతులను చేయనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
2023 సంవత్సరపు అదృష్ట రాశిచక్రాలు
మిథునం (Gemini): 2023 సంవత్సరంలో జరగబోయే గ్రహ సంచారాలు ఈ రాశి వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మిథునరాశి వారి ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా మీరు ప్రయోజనం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్య (Virgo): రాబోయే సంవత్సరం కన్యారాశి వారికి చాలా డబ్బును ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది. మీ కెరీర్ లో పురోగతికి మంచి అవకాశాలున్నాయి. పరిశోధన రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మకరం (Capricorn): 2023 సంవత్సరంలో ఏర్పడనున్న ధనరాజయోగం మకర రాశి వారిని ధనవంతులను చేస్తుంది. వీరి ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు (Sagittarius): 2023 సంవత్సరంలో ఏర్పడుతున్న ధన యోగం ధనుస్సు రాశి వారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశివారిపై శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. రిస్క్‌తో కూడిన పెట్టుబడుల నుండి కూడా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆస్తి, వాహనం కొనుగోలు చేయవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది.
Also Read: Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో ఈ రాశులకు కేతు గ్రహ అనుగ్రహం.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.