Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో ఈ రాశులకు కేతు గ్రహ అనుగ్రహం.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Ketu Gochar In Kanya: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కేతు గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించబోతోంది. కేతు గ్రహం యొక్క ఈ సంచారం మూడు రాశులవారికి ప్రయోజకరంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 04:52 PM IST
Ketu Gochar 2023: కొత్త ఏడాదిలో ఈ రాశులకు కేతు గ్రహ అనుగ్రహం.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Ketu Gochar In Kanya: 2023లో రాహువు, కేతువు వంటి గ్రహాలు రాశిని మార్చబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఏడాదిన్నరికి ఒకసారి తమ రాశిని మారుస్తాయి. ఆస్టాలజీలో కేతువును ఛాయా గ్రహం అంటారు. అయితే కర్మ యొక్క ప్రధాన గ్రహం కేతువు. ఈ ఫ్లానెట్ కొత్త ఏడాదిలో తులరాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించబోతుంది. కేతువు యెుక్క సంచారం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సింహ రాశి (Leo): కేతువు సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లోకి ప్రవేశించబోతోంది. అందుకే ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. 

మీన రాశిచక్రం (Aries): కేతు గ్రహం యొక్క సంచారం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కేతు గ్రహం మీ రాశి నుండి ఏడవ ఇంట్లో సంచరించబోతోంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

మకర రాశిచక్రం (Capricorn): కేతువు యొక్క రాశి మార్పు మీకు కెరీర్ లో విజయాన్ని, వ్యాపారంలో లాభాలను ఇస్తుంది. ఎందుకంటే కేతు గ్రహం మీ సంచార జాతకంలో తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మరోవైపు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి.

Also Read: Mercury Planet: బుధుడి రాశిలో మార్పు... న్యూ ఇయర్ లో ఈ రాశులవారిపై డబ్బు వర్షం.. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Trending News