Guru Pushya Yoga 2023 date: బంగారం కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ మాత్రమే కాదు గురు పుష్య యోగం కూడా చాలా మంచి రోజు. ఈ గురు పుష్యయోగం ఏప్రిల్ 27న ఏర్పడనుంది. ఈరోజుకు హిందూమతంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు బంగారం కొనడానికి శ్రేయస్కరం. అందుకే చాలా మంది గురు పుష్య యోగంలో బంగారం, వెండి, ఇళ్లు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈ పవిత్ర దినాన మీరు కార్యం చేపట్టినా అది వెంటనే పూర్తవుతుంది. ఈ రోజున బంగారం కొనడానికి అనుకూలమైన సమయం తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు పుష్య యోగం ఎప్పుడు?
ఏప్రిల్ 27న పుష్య నక్షత్ర యోగం ఏర్పడుతుంది. ఇది గురువారం వస్తుంది కాబట్టి దానిని గురు పుష్య యోగం అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 07:00 గంటల నుండి మరుసటి రోజు ఏప్రిల్ 28వ తేదీ ఉదయం 05:06 గంటల వరకు గురు పుష్య యోగం ఉంటుంది. 


Also Read: Jupiter rise 2023: మరో 48 గంటల్లో ఈ రాశుల అదృష్టం మారబోతుంది.. మీ రాశి ఉందా?


ఈ రోజున ఏమి కొనాలి?
ఈ రోజున మీరు బంగారం, వెండి, భూమి, భవనం మరియు ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు శ్వేతార్క్ గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. ఈరోజు అంతా బంగారం కొనడానికి మంచిది. ఈ రోజు భద్ర కాలం మధ్యాహ్నం 01:38 నుండి అర్థరాత్రి 02:49 వరకు ఉంటుంది.


Also Read: Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ రాశులవారికి చాలా ప్రమాదకరం.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.