Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల దశ తిరగబోతుంది...ఇక వీరికి డబ్బే డబ్బు.. ఇందులో మీది ఉందా?
Astrology: ఉగాది రోజున మీనరాశిలో 5 గ్రహాల కలయిక జరగబోతుంది. దీని కారణంగా ఏర్పడిన మహాయోగం మూడు రాశులవారికి భారీగా ప్రయోజనాలను అందించనుంది.
Ugadi 2023 date: తెలుగువారి సంవత్సరాది అంటే ఉగాది మార్చి 22 నుండి మెుదలుకానుంది. హిందూ నూతన సంవత్సర సంవత్ 2080 కూడా ఆరోజే నుండే ప్రారంభం కానుంది. ఉగాది నాడు బుధాదిత్య, గజకేసరి అనే రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా మీనంలో బృహస్పతి, సూర్యుడు, బుధుడు, చంద్రుడు మరియు నెప్ట్యూన్ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ అరుదైన సంయోగం కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి (Sagittarius): ఉగాది నుండి మీకు మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో మీ ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథునం (gemini): ఉగాది నాడు ఏర్పడే మహాయోగం మిథున రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది బృహస్పతి, సూర్యుడు మీ రాశి యెుక్క జాతకంలో మంచి స్థానంలో ఉన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆఫీసులో కొత్త బాధ్యతను తీసుకుంటారు. బిజినెస్ చేసేవారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది.
సింహం (Leo): హిందూ నూతన సంవత్సరం సింహ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో బుధాదిత్య మరియు గజకేసరి రాజయోగాలు రూపొందుతున్నాయి. దీని కారణంగా మీకు ఆధ్యాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పరిశోధన రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Rahu Mahadasha Effect: 18ఏళ్లు పాటు ఉండే రాహు మహాదశ.. ప్రభావం, పరిహారం తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook