Rasi Phalalu: ఈ వారం 6 రాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్.. ఇందులో మీరు కూడా ఉన్నారా?
Rasi Phalalu This Week Telugu: ఈ వారం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో జరిగే కొన్ని గ్రహ సంచారాల కారణంగా ఈ క్రిందిరాశుల వారిపై స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..
Rasi Phalalu Telugu: జ్యోతిష్య శాస్త్రం పరంగా డిసెంబర్ 8వ తేదీ నుంచి కొత్త వారం ప్రారంభమవుతుంది. ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొన్ని గ్రహాలు తిరోగమనం చేయడమే కాకుండా సంచారం కూడా చేయబోతున్నాయి. అలాగే ఈ వారం గ్రహగమనాలని పరిశీలన చేస్తే వృశ్చిక లగ్నంలో రవి, బుదులు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక శుక్రుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. కుంభరాశిలో చంద్ర, శనులు.. రాహువు మేషరాశిలో.. గురువు వృషభంలో.. కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. అయితే ఈ వారం ఏయే రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
మేష రాశి:
మేష రాశి వారికి ఈ వారం నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశిలో చంద్ర, శనులు.. ఆరులో కేతు సంపూర్ణంగా గురుబలం సహకరిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభయోగాలు ఉంటాయి. మీ కృషిని బట్టి అదృష్టం వరిస్తుంది. భవిష్యత్తుగా అవసరమైన నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుని.. వాటిని అమలు చేయండి. శుభప్రదమైన కార్యసిద్ధి ఉంటుంది.. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఏకాగ్రత పనిచేయడం ద్వారా లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఆశయం నెరవేరే దిశగా కృషిని కొనసాగించండి.. మనది అనుకొని బాధ్యతలని నిర్వర్తించండి.. లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా జాగ్రత్తలు తీసుకోండి.. విశ్వాసంతో పని చేయండి. కలహ సూచనలు ఉన్నాయి.. కాబట్టి మితంగా సంపాదించండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. అనవసరమైన విషయాలని పదే పదే మనసుకి గుర్తు చేసుకోవద్దు. ఒక మెట్టు దిగిన సరే.. అహాని పక్కనపెట్టి పనిచేయడం ద్వారా ఇబ్బందులు దూరమవుతాయి. వ్యాపారంలో కూడా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ముఖ్య కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు మిత్రులు సూచనలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కృషిను కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
వృషభ రాశి:
ఈవారం వృషభ రాశి వారికి చక్కగా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి. చంద్రుడు తృతీయంలో.. కుజుడు తొమ్మిదిలో.. శుక్రుడు 11లో రాహువు ఉన్నాయి. కాబట్టి వీరికి బ్రహ్మాండమైన కాలంగా చెప్పవచ్చు.. ముఖ్యమైన కార్యాలలో త్వరగా విజయం ఉంటుంది. మీరు అనుకున్న విధంగానే ఫలితాలు వస్తాయి. కాబట్టి మంచినే అధికంగా కోరుకోండి. ఆర్థిక అభివృద్ధితో పాటు ఏకాగ్రత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వృధా కాలక్షేపాలతో కాలాన్ని దుర్వినియోగం చేసేవారు తారసబడతారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోండి. అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది. మీ పనిలో మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. అదే కాలం నుండి ప్రశంసలు ఉంటాయి. సమయానకులంగా వ్యవహరించి పనిచేస్తే మేలు జరుగుతుంది. మీరు దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోండి.. వ్యాపారంలో నిబద్ధతను పెంచండి సరైన సత్ఫలితాలు సాధించేంతవరకు కృషిని కొనసాగించండి.
మిధున రాశి:
మిధున రాశి వారికి ఈ వారం నాలుగు గ్రహాల సంచారాలు శుభాన్ని కలిగించబోతున్నాయి. ఈ రాశి వారికి ఆరులో రవి, బుదులు.. 8లో శుక్రుడు, పదిలో రాహువు శుభప్రదమైన కాలంలో గోచరిస్తోంది. సకాలంలో నిర్ణయాలు తీసుకుని.. వాటిని అమలు చేయడం ద్వారా బ్రహ్మాండమైన విజయం సొంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.. మిత్రుల అండ పెరుగుతుంది.. తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారంగా కృషిను కొనసాగిస్తే విజయం మీదే అధికార యోగాలు చక్కగా సహకరిస్తాయి. కాలానుగుండా ఆలోచిస్తూ ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిని సాధించండి. భవిష్యత్తు బంగారమాయంగా ఉంటుంది. సమయానుకూలంగా ఆలోచిస్తే వ్యాపారంలో కూడా విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సముచిత నిర్ణయాలు మేలు చేస్తాయి. గుర్తుపెట్టుకో పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు కొన్ని చేస్తారు. వల్ల శుభప్రదమైన ధనయోగం కలుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. పలుమార్గాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. నిరంతర సాధనతో ప్రశాంతమైన జీవనాన్ని పొందుతారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ వారం రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశిలో గురువు, తృతీయల్లో కేతువు ఉన్నాడు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి.. కార్యసిద్ధి లభిస్తుంది. ఏకాగ్రత అవసరం.. ప్రతిపనిలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేయండి. ఎంత శ్రద్ధ పెంచితే.. అంత మంచి జరుగుతుంది. నిర్లక్ష్యం వహించకుండా.. లక్షభావంతో పనిచేయండి. ఎందుకంటే అధికంగా విఘ్నాలు గోచరిస్తున్నాయి. పనులు మధ్యలో వాయిదా వేయొద్దు. అనుమానాస్కులంగా ఏ పని చేయొద్దు. మీ సామర్థ్యాన్ని అనుసరించి పనులు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వ్యాపార పరమైన నష్టాలు కుదిరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితో కృషి చేయండి. అపార్థాలకు తావ లేకుండా వ్యవహరించండి. ఆవేశానికి గురి చేసేవారు ఉంటారు. స్పష్టంగా మాట్లాడాలి ఒత్తిడికి గురి కావద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. విశ్వాసంతో పని చేస్తే ప్రతి విషయంలో ఉద్యోగ, వ్యాపారంలో ప్రతి విషయంలో మేలు జరుగుతుంది. సానుకూల వాతావరణ ఏర్పడే విధంగా సంభాషించాలి. పరిస్థితులు తగ్గట్టుగా వ్యవహరించండి ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి.
సింహ రాశి:
ఈ వారం సింహ రాశి వారికి రెండు గ్రహాల యోగిస్తున్నాయి. బుద్ధుడు శుభ స్థానంలో ఉండడం వల్ల బుద్ధి బలంతో పాటు వ్యాపార యోగాన్ని కూడా ప్రసాదిస్తారు. చంద్రుడు ఏకాగ్రతను ఇస్తారు. కాబట్టి ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి.. మనోబలంతో విశేషమైన కార్యసిద్ధిని సొంతం చేసుకోండి. శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది.. వ్యాపారంలో మేలు జరుగుతుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. తగినంత గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి కలుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా ఆలోచించి పనిచేస్తే..త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. కాలం వృధా కాకుండా మితంగా సంభాషించండి. మీ బాధ్యతలను మీరు త్వరగా పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. అధికారులతో శాంతంగా వ్యవహరించాలి. తోటి వారి నుండి ఇబ్బంది కలగకుండా వారిని కలుపుకోవాలి. ఇతరుల విషయాల్లో కలహాలు చేసుకోవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి.. కీర్తి ప్రతిష్టలతో భంగం కలగకుండా చూసుకోవాలి.
కన్య రాశి:
ఈ వారం కన్యా రాశి వారికి రవి ఏకాదశిలో.. కుజుడు భాగ్యంలో గురువు పంచములలో.. శుక్రుడు స్పష్టంలో.. చంద్ర, శనులు శుభ స్థానంలో ఉన్నారు. ఎటుచూచిన శుభమే గోతిరిస్తుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీ నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. దివ్యమైన కాలం కొనసాగుతోంది..అద్భుతమైన విజయం లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండమైన భవిష్యత్తుని ఇస్తాయి. ప్రధాన కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ప్రశంసలు ఉంటాయి. కొన్ని విషయాల్లో సాహసభ్యంగా వ్యవహరించి లక్ష్యాలను పూర్తి చేస్తారు. గతంలో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. కీర్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. గృహ వాహనాతి యోగాలు కలిసి వస్తాయి. భూ సంబంధమైన విషయాల్లో మేలు జరుగుతుంది. న్యాయపరమైన విషయంలో చాలా మేలు జరుగుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు.
Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.